
అయితే, రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కొత్త పార్టీ ని పెట్టారు ఆయన కొడుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. అనంతరం ఎన్నికల ముందు పాదయాత్రతో తండ్రికి తగ్గ తనయుడు అంటూ వైఎస్ఆర్ అభిమానుల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్. కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి కుటీంబీకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైఎస్ అనుచరులు చెబుతున్నారు. అనంతరం.. వైఎస్ కుటుంబం రాజకీయాల్లో విడిపోయి వైఎస్ జగన్ చెల్లెలు, వైఎస్ ఆర్ కూతురు వైఎస్ షర్మిల ఆమె తల్లితో కలిసి తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పేరుతో కొత్త పార్టీ పెట్టారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానని చెప్పిన పార్టీ పెట్టిన షర్మిలకు.. కీలక నేతల అండ లేదనే చెప్పాలి. ఈ సందర్భంలో తన కూతరుకి మద్దతు ఇవ్వాలని వైఎస్ సతీమణీ వైఎస్ విజయమ్మ తెలంగాణ లో ఉన్న వైఎస్సార్ అనుచరులను కొరారు. ఇందులో భాగంగానే పార్టీలకు అతీతంగా వైఎస్సార్ సంస్మరణ సభ నిర్వహించారనే ప్రచారం కూడా ఇటీవల సాగింది.
అయితే, వైఎస్ ఆర్ ఫోటో తో రాజకీయాల్లోకి వచ్చిన షర్మిలకు రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఏ మేర సపోర్ట్ చేస్తారో అనేది వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కి కార్యకర్తలే ఎక్కువగా వైఎస్సార్ అభిమానులుగా ఉన్నారు. అలాగే, వైఎస్ఆర్ కేబినెట్ లో పని చేసిన కీలక నేతలు, ఆయన సన్నిహితులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో వైఎస్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ వూపు ఉంటారా వైఎస్ కుటుంబం వైపు ఉంటారనేది తేల్చలేని ప్రశ్నగా ఇప్పటి వరకు మిగిలి ఉంది.