ఇటీవలి కాలంలో ప్రేమ అనేది ఎన్నో దారుణ ఘటన లకు కారణం అయిపోతుంది. సాధారణంగా ప్రేమ అనేది రెండు మనసుల కలయిక అనే విషయం తెలిసిందే. ఇద్దరికీ ఇష్టమైనప్పుడే అది ప్రేమ అంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతో మంది యువకులు ప్రేమ అంటూ యువతుల వెంట పడటం ఇక ప్రేమను రిజెక్ట్ చేస్తే ప్రేమోన్మాదులు గా మారి పోవడం లాంటివి చేస్తున్నారు. తమ ప్రేమను అంగీకరించలేదు అనే కారణంతో ఏకంగా ప్రియురాలి పైన కక్ష పెంచుకుని ప్రేమోన్మాదులు గా మారిపోతూ దారుణాలకు పాల్పడుతున్న  ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఏకంగా కొంతమంది ప్రేమోన్మాదులు రెచ్చిపోయి దారుణంగా ప్రాణాలు తీస్తుంటే మరికొంతమంది చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఓ యువకుడు ప్రేమ పేరుతో అమ్మాయి వెంట పడ్డాడు. యువతి ప్రేమకు అంగీకరించకపోవడంతో ప్రేమోన్మాదిగా మారిపోయాడు. ఏకంగా ఇంటికి నిప్పంటించి దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జోహార్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని బి జె ఆర్ నగర్ కు చెందిన నవీన్ అనే 23 ఏళ్ల యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అయితే రెండు సంవత్సరాలుగా స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడుతూ పెళ్లి చేసుకుంటాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.


 అయితే సదరు యువతికి వేరే యువకుడితో పెళ్లి చేసేందుకు ఇటీవల తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. అయితే ఈ విషయం నవీన్ కి తెలిసింది. ఈ క్రమంలోనే ఏకంగా ఆ యువతి బంధువులను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇంటిని తగల పెడతాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే ఇటీవలే ఆ యువతి నానమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటికి తాళం వేసి హాస్పిటల్కి వెళ్లారు కుటుంబ సభ్యులు. ఇక ఆ మరునాడే పక్కింటి వారి నుంచి వారికి ఫోన్ వచ్చింది. ఇళ్ళు మొత్తం తగలబడిపోయింది అంటూ సమాచారం అందించారు. ఇక సంఘటన స్థలానికి చేరుకొని నవీన్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడు అంటూ భావించి పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: