ఏం చెప్పారు మంత్రి గారూ... మీరు సూపర్ అండీ
భారత దేశంలో గత నెల రోజులుగా  ప్రతి రాష్ట్రం లోనూ ఒకటే చర్చ. మాదక ద్రవ్యాలు. డ్రగ్స్ లభ్యం కావడం. మాదక ద్రావ్యాలు వాడుతూ పోలీసులకు  చిక్కిన సినీతారలు, వారి కుటుంబ సభ్యులు. గంజాయిని ద్వంసం చేసిన పోలీసులు. తెలంగాణ లో గంజాయి మొక్క కూడా లేకుండా చేయాలని  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు  హుకుం.  ఇవీ  ప్రచార మాధ్యమాలలో నిత్యం కనిపించిన వార్తలు. చర్చలు. ఈ నేపథ్యంలో  ఆ మంత్రి  సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటో ఓ సారి చూద్దాం.
చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు....ఆంధ్ర ప్రదేశ్ లోని ఆచంట నియోజక వర్గం నుంచి వై.ఎస్.ఆర్ కాంగ్రె స్ నుంచి 2019 ఎన్నికల్లో గెలుపొంది అసెంబ్లీలో ప్రవేశించిన ప్రజాప్రతినిధి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహాన్ రెడ్డికి సన్నిహితులలో ఒకరు గా పేరు పెందిన వ్యక్తి. అంతే కాదు ఆయన మంత్రి వర్గ సహచరుడు కూాడా.  రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిత్వం వెలగబెడుతున్న వ్యక్తి.  
ఆయన గంజాయి సాగు పై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. అందరినీ నివ్వెర పరిచారు. గంజాయి సాగు దేశమంతా జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లోమాత్రమే కాదు. ఈ విషయం మీకు తెలియదా ? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఆంధ్ర ప్రదేశ్ లోమాత్రమే గంజాయి సాగవుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై పని గట్టుకుని అపద్దపు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రజల్లో ముఖ్యమంత్రి కి ప్రజాదరణ పెరుగుతుండటంతో ఓర్వలేకున్నారని అన్నారు.  స్థానికంగా పరపతి కోల్పోయిన చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా తెలుగువారి పరువు తీశారని చెప్పారు.  ఆయనను కలిసేందుకు కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వక పోవడం ప్రపంచ మంతా చూసి నవ్వుకుందని తెలిపారు.  ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని  తిట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేతకే దక్కుతుందని ఆరోపించారు. మాజీ ముఖ్యంత్రి నారా చంద్ర బాబు నాయుడి పై  మంత్రి శ్రీ రంగనాథ రాజు తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో వైఎస్ అర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని  వివరించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల వార్డుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐదుకోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఈ ఆసుపత్రిలో ఆరు అంతస్తుల భవనం నిర్మిస్తామని చెప్పారు. గుంటూరు మెడికల్ కాలేజి పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ భవన నిర్మాణం జరుగుతుందని మంత్రి వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: