తెలంగాణాలో ఇప్పటికే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారిపోతుంది. తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకు తిరుగుతున్న కాంగ్రెస్ దాదాపుగా ఆఖరి స్థానానికి పడిపోయినట్టే. దేశంలోనే ఆ పార్టీకి అదే స్థానం అనుకోండి. అయితే ఇక అక్కడ ఉన్న పార్టీలు తెరాస, అది కూడా అదికార పార్టీ. కానీ కొత్త పార్టీగా వచ్చిన వైఎస్ షర్మిల పార్టీ ఈ సారి ఎన్నికలలో ప్రభావం చూపనుందా అంటే అందుకు కాస్త అవకాశం ఉన్నట్టే గత రెండు ఉపఎన్నికలు తెలియజేస్తున్నాయి. తాజా ఉపఎన్నిక కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్లడంతో అది ప్రధాన ప్రతిపక్షం స్థాయిని సీట్ల స్థాయిలో కాకపోయినా ఇతర పార్టీలతో పోల్చి చూస్తే, అందరి కంటే ముందే ఉందని చెప్పవచ్చు. అదే తరహాలో షర్మిల కూడా ముందుకు దూసుకెళ్లగలిగితేనే ఈ రేసులో ముందుకు వెళ్లగలదు.

వచ్చే ఎన్నికలలో తెరాస దాదాపుగా అంచుల మీదుగా గెలిచే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. కానీ మిగిలిన సీట్లలో కొన్ని ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, కానీ అంటే స్థాయిలో షర్మిల పార్టీ కూడా ప్రభావం చూపించాల్సిన అవసరం ఉంది. ఇలా జరగకపోతే ఆ పార్టీ ఎవరికోసమో వచ్చింది తప్ప, మరో ఉద్దేశ్యం కాదని అర్ధం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఓట్ల చీలిక కోసం తప్ప ఆ పార్టీ ప్రయోజనం లేదని అర్ధం. అందుకు ఎవరు ఆ పార్టీ తెచ్చినట్టు అంటే, రెండు మాత్రమే అలా చేయగలవు. ఒకటి బీజేపీ, అంత రాజకీయం చేయగలిగేది ఆ పార్టీనే. మరొకరు కేసీఆర్, ఈయన కూడా ఇతర పార్టీల ను దారిమళ్లించేందుకు ఈ కొత్త పార్టీ వెనుక ఉండవచ్చు. కనీసం ఆస్తుల కోసమైనా వైఎస్ కుటుంబం కేసీఆర్ మాట వినక తప్పదు అనేది ఇక్కడ సందర్భం.

పెద్దగా ప్రయోజనం లేకపోయినా, కేసీఆర్ ఈ వ్యూహాన్ని పన్నింది కేవలం ఓట్ల చీలిక కోసమే. ఆ పార్టీతో ఎటువంటి పొత్తులు ఉండబోవు, పరోక్షంగా ఆ పార్టీ తెరాస కోసం పనిచేస్తుంది అంతే. దానికి కూడా షర్మిల ఎవరితో కలిసి పోటీలోకి దిగుతుంది అనేదానికి పెద్దగా ఆప్షన్ లు కూడా లేవు. అయితే బీజేపీ లేదా కాంగ్రెస్. బీజేపీ తో నడిచే అలవాటు లేదు, కాంగ్రెస్ తో నడిస్తే ఉన్నది కూడా పోయే ప్రమాదం ఉంది. అంటే ఏదేమైనా వైఎస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో వైఎస్ పాలన తేవాలి అని పెట్టి ఉంటె, ఒంటరిగా బరిలోకి దిగటం మేలు. అదే కాస్తైనా ఓటు బ్యాంకులు సృష్టించగలదు. కానీ పక్షంలో ఎవరి తోకగానో మిగిలిపోవాల్సి వస్తుంది. అలా ఉంటె పోటీలో సీట్ల కోసం కూడా అభ్యర్థిస్తూ ఉండాల్సి వస్తుంది. అసలు పోటీకి ఉంటుందా లేక పవన్ కళ్యాణ్ మాదిరి ఈసారి వద్దులే, మళ్ళీ వచ్చే సారి పోటీకి దిగడం అంటుందా అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: