ఏపీ లో కృష్ణా జిల్లా టిడిపి రాజకీయాలు గత రెండు సంవత్సరాలుగా ఎప్పుడు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన విజయవాడ ఎంపీగా కేశినేని నాని మాత్రం వరుసగా రెండోసారి విజయం సాధించారు. అప్పటి నుంచి కృష్ణా జిల్లా టిడిపి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. బెజవాడ నగరంలోని బుద్ధా వెంకన్న - బోండా ఉమామహేశ్వర రావు - షేక్ నాగుల్ మీరాకు ఎంపీ నానికి అసలు పడటం లేదు. ఈ క్రమంలోనే ఎంపీ మాజీ మంత్రి , మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు కు కూడా తీవ్ర‌మైన గ్యాప్ ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నుంచే వీరి మధ్య అస్సలు ప‌డేది కాదు. అయితే ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి.

కొండపల్లిలో 29 వార్డులుండగా వైసీపీ, టీడీపీ 14 వార్డులు స‌మానంగా రావ‌డంతో ఇక్క‌డ పోటీ టై అయ్యింది. అయితే ఒక స్థానంలో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా టీడీపీలో చేరిపోవ‌డంతో ఇక్క‌డ టీడీపీ బ‌లం పెరిగింది. ఆమె కూడా టీడీపీ రెబ‌ల్ అభ్య‌ర్థే. దీంతో ఇక్క‌డ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఇక్కడ కీలకంగా మారడం తో పాటు ఏ పార్టీకి ద‌క్కుతుంది ? అన్న‌ది సస్పెన్స్ గా మారింది. ఇక స్థానిక ఎమ్మెల్యే కోటాలో వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కూడా వైసీపీకి ఓటు వేస్తే అప్పుడు మ‌ళ్లీ రెండు పార్టీల‌కు 15 ఓట్లు వ‌స్తాయి.

అయితే ఇప్పుడు ఇక్క‌డ కేశినేని నాని ఓటు కీల‌కంగా మారింది. విజ‌య‌వాడ ఎంపీ గా ఉన్న‌ కేశినేని నాని ఈ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా చేరడానికి సంబంధిత అధికారికి లేఖ రాయ‌డంతో ఇప్పుడు చైర్మ‌న్ ఎన్నిక‌లో ఆయ‌న ఓటు కీలం కానుంది. ఏదేమైనా నాని వ‌ర్సెస్ ఉమా మ‌ధ్య ఎంత గ్యాప్ ఉన్నా కూడా ఇప్పుడు నాని ఓటు ఉమాకు అండ‌గా ఉన్న‌ట్టు అయ్యింది. మ‌రి ఈ ప‌రిణామాల మ‌ధ్య కొండ‌ప‌ల్లి మున్సిపాల్టీపై ఏ పార్టీ జెండా ఎగ‌ర‌నుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: