తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన కుటుంబాలలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కూడా ఒకటి అనేది అందరికీ తెలిసిన విషయమే.  ఈ ఏడాది మాత్రం ఆ కుటుంబ వ్యవహారాలు మీడియా జనానికి మంచి సరుకుని అందించాయి. ఆ కుటుంబంలో  విభేదాలు మీడియా కు టన్నులకొద్దీ వార్తల దించాయి. అందిస్తున్నాయి కూడా. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఆయన తల్లి విజయమ్మ,  సోదరి షర్మిల ఎంతో శ్రమించారు అన్నది అందరికీ తెలిసిన విషయం. అదే సమయంలో షర్మిల మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, ఒక చరిత్ర సృష్టించారు కానీ వై ఎస్ ఆర్ సి పి అధికారంలోకి వచ్చాక వీరిద్దరు కూడా రాజకీయ యవనికపై కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక షర్మిల చాలాకాలం అమెరికాలోనే గడిపారు. ఆమె అక్కడ ఎందుకు ఉన్నారు? అనే విషయం ఎవరికీ తెలియలేదు ఆమె హఠాత్తుగా ఇండియా లోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించి, ఆ మేరకు సొంత పార్టీని స్థాపించారు.

 ఇది తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది. అయితే జగన్ మోహన్ రెడ్డి  సొంత పత్రికల్లో, టీవీలో ఆశించినంత మేర షర్మిలకు ప్రాధాన్యంత కనిపించలేదు. ఇది సహజంగానే షర్మిలకు మన స్థానాన్ని  కల్గించింది.  ఇదే విషయాన్ని ఆమె ఒక బహిరంగ వేదికపై తన అక్కసును వెళ్లగక్కారు. ఆ తర్వాత దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పుష్కర వర్ధంతి వచ్చింది ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులో వైఎస్ అభిమానులు తమదైన రీతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సన్నిహితంగా మెలిగిన సీనియర్ రాజకీయ నాయకగులు  మహీధర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి  లతో పాటు,  వైయస్ మంత్రివర్గ సహచరులు ధర్మాన ప్రసాదరావు,  ఆనం రామనారాయణ రెడ్డిని కూడా ఆహ్వానించారు. కారణం ఏదైనా  ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి తో ఉన్నవారు ఈ సభకు హాజరు కాలేదు. 2021లో వైఎస్ కుటుంబంలో అసంతృప్తులు వెలుగుచూశాయి. ఆ కుటుంబంలో ఏ ఇద్దరి మధ్య సయోధ్య లేదని మీడియా జనాలు వార్తా కథనాలను జనానికి  వండి వారుస్తున్నారు. ఇది నిజం.




మరింత సమాచారం తెలుసుకోండి: