
ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ ఎలా శరవేగంగా వ్యాప్తి చెందుతుందో చూస్తూనే ఉన్నాం. ఇక మన దేశంలో సగటున రోజుకు 16 వేలకు కేసులు వెళ్లిపోయాయంటే పరిస్థితి తీవ్ర అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టేశారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కోవిడ్ నిబంధనల మధ్యే న్యూ ఇయర్ వేడుకలు జరుపు కోవాలన్న ఆదేశాలు వచ్చేశాయి.
ముఖ్యంగా పెద్ద నగరాలు గా ఉన్న విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పోలీసులు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు పెట్టడంతో అక్కడ జనాలు, యువత షాక్ లో కి వెళ్లిపోయారు. విజయవాడలో ఈ రోజు రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని కమిషనర్ క్రాంతి రాణా ఇప్పటికే చెప్పేశారు. ఇక ఇండోర్ వేడుకలు కూడా అర్ధరాత్రి 12 గంటల వరకే ఉంటాయి.
నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, రోడ్లపై ఎవరూ తిరగరాదని క్రాంతి రాణా వార్నింగ్ ఇచ్చారు. రోడ్ల పై ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడటంపై నిషేధం విధించినట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని క్లబ్ లు, రెస్టారెంట్లలో సైతం 60 శాతం ఆక్యుపెన్సీతోనే వేడుకలు నిర్వహించాలని కూడా ఆయన సూచించారు. ఏదేమైనా కరోనా దెబ్బతో ఈ సారి న్యూ ఇయర్ వేడుకలకు కూడా షాక్ తప్పలేదు.