కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యేగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గెలుపు అనంతరం నియోజకవర్గంలో ఆయనకు ప్రజల నుండి లభించిన ఆదరణ అసాధారణమే అని చెప్పాలి. ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత కూడా నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు మరింత చేరువ అయ్యారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగుజాడల్లో ప్రజా సంకల్ప యాత్ర చేశారు. నాడు చేపట్టిన ఆ ఒక్క యాత్ర ఎమ్మెల్యే వసంతకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అదే ఫాలోయింగ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని విజయాలను నమోదు చేసింది. పంచాయితీ ఎన్నికల్లో 60 పైగా పంచాయితీలకు గాను 58 పంచాయితీలకు కైవసం చేసుకొని చారిత్రక విజయాలు నమోదు చేశారు. ఓడిన చోట ఉప సర్పంచ్ లను కైవసం చేసుకొని రికార్డు నెలకొల్పారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో వసంత క్రేజ్ పనిచేయగా కాల క్రమేణా వసంత ఫేం నెమ్మదించింది అని చెప్పాలి.

సోషల్ మీడియా లో ఆల్ టైం రికార్డు సృష్టించిన ఎమ్మెల్యే వసంత ఫాలోయింగ్ కాస్తా జారిపోయే పరిస్థితి నెలకొంది. మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్మధనం, నేతల అలకలు, అధినేత బెట్టు వెరసి కాస్త అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత ఫాలోయింగ్ మందగించింది. ఫలితంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకునే పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికైనా ఒరిగింది ఏమి లేదని మళ్ళీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రజల్లోకి వస్తే వార్ వన్ సైడ్ అయిపోతుంది అనేది వసంత అభిమానుల వాదన. అందులో భాగంగానే రావాలి వసంత..!! కావాలి నాటి వైభవం...!! అంటూ ఒక నినాదం తెర మీదకు తీసుకొస్తున్నారు వసంత అభిమానులు. ఆయన ఒక్కసారి ప్రజల్లోకి వస్తే  రాజకీయ అనిశ్చితికి శుభం కార్డు పడుతుంది అని అలానే ఎమ్మెల్యే వసంత జైత్ర యాత్ర కొనసాగుతుంది అనేది వసంత అభిమానుల ఆకాంక్ష. మరి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎలాంటి వ్యూహం తో ముందుకు వస్తారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: