భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ప్రతిరోజు ప్రపంచానికి తెలిసిన మినీ యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్న విషయం  తెలిసిందే. ఒకవైపు ఉగ్రవాదులని భారత్లోకి పంపించడం చేసి ఎన్నో మారణహోమాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. లేదంటే ఇక సరిహద్దుల్లో సైనికులతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడటం లాంటివి చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అటు భారత ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదుల ఆట లకు  అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది.



 ఇలా భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు అన్ అఫిషియల్ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే ఒకప్పుడు కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఆటలు సాగేవి. కాశ్మీర్ లోని ప్రజలు కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడంతో ఇక భారత ఆర్మీకి పోలీసులకి ఉగ్రవాదులను కనిపెట్టడం ఎంతో కష్టంగా మారింది. ఎప్పుడైతే కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు అయింది. అప్పటి నుంచి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఇక భారత సైన్యం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేస్తూనే ఉంది.. కొన్ని నెలల నుంచి వెంటాడి వేటాడి మరి ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేస్తూ ఉండడం గమనార్హం.


 కేవలం కొన్ని నెలల సమయం లోనే వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత ఆర్మీ. ఇప్పుడు మరోసారి కాశ్మీర్ సరిహద్దుల్లో ఆర్మీ విజృంభించింది అని తెలుస్తోంది. ఇటీవలే కాశ్మీర్ ప్రాంతంలో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. రెండు వేరువేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు  ఇక మృతుల్లో జైషే మొహ్మద్ కమాండర్ జావిద్ వని లాంటి ఒక పెద్ద ఉగ్రవాది కూడా ఉండడం గమనార్హం. కాశ్మీర్లోని బుద్ డన్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది  12 గంటలపాటు జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా ఇక సంఘటన స్థలంలో ఏకే-47 లాంటి తుపాకుల ను సొంతం చేసుకుంది భారత ఆర్మీ.

మరింత సమాచారం తెలుసుకోండి: