వివేకా హత్య కేసు మళ్లీ వార్తల్లో నలుగుతోంది. వివేకా హత్య వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారంటూ సీబీఐ తన నివేదికల్లో చెప్పడం కలకలం రేపుతోంది. దీంతో ఈ అంశంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ కేసులో త్వరలో అరెస్టులు కూడా ఉంటాయన్ని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్యపై ఆయన చెల్లెలు విమలారెడ్డి స్పందించారు.


ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ కేసులో రాజకీయ ప్రమేయం ఉందనేది స్పష్టంగా కనిపిస్తోందని విమలా రెడ్డి అంటున్నారు. వివేకాను చంపిన నిందితులు తమ నేరాన్ని అంగీకరించిన తరువాత కూడా ఈ కేసు ఎందుకు కొనసాగిస్తున్నారని విమలా రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో ఎవరినో ఇరికించాలనే ఉద్దేశంతోనే కేసును కొనసాగిస్తున్నట్లు తాను భావిస్తున్నానని విమలా రెడ్డి  అన్నారు.


వివేకా హత్యలో వైఎస్ కుటుంబానికి ఏమాత్రం ప్రమేయం లేదని వైఎస్ విమల రెడ్డి క్లారిటీగా చెప్పారు. వివేకానందరెడ్డిని హత్య చేసింది పూర్తిగా బయటి వాళ్లేనని విమలా రెడ్డి చెప్పారు. వివేకాను హత్య చేసిన వారు తమ నేరాన్ని అంగీకరించారన్న విషయాన్ని విమలా రెడ్డి  గుర్తు చేశారు. ఇక ఇంతటితో దీన్ని ఆపేయాలని.. కానీ.. అలా చేయకుండా ఎందుకు కొనసాగించాల్సి వస్తోందని విమలా రెడ్డి ప్రశ్నించారు.


రాజకీయంగా దీన్ని వాడుకునేందుకే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని కొనసాగిస్తున్నారని విమలా రెడ్డి ఆరోపిస్తున్నారు. వైఎస్ కుటుంబంపై రాజకీయంగా పగ సాధించడానికి హత్య కేసును వాడుకుంటున్నారా అన్న అనుమానం వస్తోందని విమలా రెడ్డి ఆరోపించారు. రాజకీయాల కోసం నీచాతి నీచమైన పనులు చేస్తున్నారని విమలా రెడ్డి బాధపడ్డారు. వైఎస్‌ కుటుంబంలో ఎవరూ.. డబ్బులు, ఆస్తుల, రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఒకరికొకరు చంపుకొనే పరిస్థితి లేదని విమలా రెడ్డి స్పష్టం చేశారు. వివేకా హత్యకేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం లేనేలేదని విమలా రెడ్డి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: