చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. పైకి చేసే ప్రకటనలు వేరే లోలోపల చేసే పనులు వేరుగా ఉంటున్నాయి. ఈ విషయం గతంలోనే అనేకసార్లు బయటపడినప్పటికీ తాజాగా బయటపడిన మరో ఘటనతో యావత్ రాష్ట్రం ఆశ్చర్యపోతోంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు అండ్ కో జగన్మోహన్ రెడ్డిని ఎంతగా టార్గెట్ చేస్తున్నది అందరు చూస్తున్నదే. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో జగన్ పాత్ర ఏమీ లేదని అందరికీ తెలుసు.





అయినా చంద్రబాబు, పవన్ కల్యాన్ మాత్రం జగన్నే పదే పదే టార్గెట్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్న నరేంద్రమోడిని మాత్రం పల్లెత్తు మాటనటంలేదు. తాజాగా మరో విషయం బయటపడింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దేశంలోని ఎంపీల సంతకాలు సేకరణ జరిగింది. ఇందులో వైసీపీతో పాటు మరో పది పార్టీలకు చెందిన ఎంపీలు 120 మంది సంతకాలు చేశారు. నిజానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీతో సంబంధంలేని చాలామంది ఎంపీలు సంతకాలు చేశారు. 





ఇంతమంది సంతకాలు చేసినా అందులో తెలుగుదేశంపార్టీ ఎంపీల సంతకాలు మాత్రం లేవు. టీడీపీకి ఉన్నదే ముగ్గురు ఎంపీలు అందులో ఒకరు శ్రీకాకుళం ఎంపీయే. అయినా వాళ్ళు ముగ్గురు సంతకాలు చేయలేదు. దీంతోనే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో టీడీపీకి ఉన్న చిత్తశుద్ది అర్ధమైపోతోంది. దేశంలోని ఎక్కడెక్కడి పార్టీల ఎంపీలు సంతకాలు పెట్టినా టీడీపీ ఎంపీలు మాత్రం ఎందుకని సంతకాలు పెట్టలేదు ? ఎందుకంటే నరేంద్రమోడి అంటేనే చంద్రబాబు వణికిపోతున్నారు కాబట్టే అనుకోవాలి.





మోడి నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు పెడితే ఏమవుతుందో అనే భయంతోనే చంద్రబాబు తన ఎంపీలతో  సంతకాలు చేయించలేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అడిగితే అడ్డుగోలుగా సమాధానాలు చెప్పటం ఖాయం. లాజిక్ లేకుండా నోటికేదొస్తే అది అడ్డంగా మాట్లాడేయటం చంద్రబాబు అండ్ కో కు బాగా అలవాటే. ఇంకా విచిత్రం ఏమిటంటే ప్రధానికి ఇచ్చిన విజ్ఞప్తిలో టీడీపీ ఎంపీలు సంతకాలు చేయని విషయాన్ని ఎల్లోమీడియా పూర్తిగా దాచిపెట్టేయటం.



మరింత సమాచారం తెలుసుకోండి: