చంద్రబాబునాయుడులో దింపుడు కళ్ళెం ఆశ ఇంకా పోనట్లుంది. అందుకనే తెలంగాణాలో తొందరలోనే యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నారు. ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో తనను కలసిన నేతలు, శ్రేణులతో సమావేశమయ్యారు. తెలంగాణాలో చాలా కాలంక్రితమే టీడీపీ జెండా ఎత్తేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏదో పేరుకు మాత్రం పార్టీ ఉందంటే ఉందంతే. నేతల పేర్లు కేవలం లెటర్ హెడ్లకు మాత్రమే పనికొస్తోంది.





ఓటుకునోటు కేసు దెబ్బకు చంద్రబాబు ఎప్పుడైతే హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయారో అప్పుడే తెలంగాణాలో పార్టీ అడ్రస్ గల్లంతైపోయింది. అవకాశాన్ని ఉపయోగించుకుని కేసీయార్ కూడా టీడీపీ మీద సీమంధ్ర ముద్ర వేసేశారు. దాంతో ఆ తర్వాత చంద్రబాబు ఎంత ప్రయత్నించినా టీడీపీ శవాసనంలో నుండి పైకి లేవలేదు. సరే ప్రస్తుతం తెలంగాణాలో అంత అన్యాయంగా కాకపోయినా ఏపీలో కూడా అలాంటి పరిస్ధితుల్లోకే కూరుకుపోతోంది. ఈ విషయంలో క్లారిటి రావాలంటే 2024 ఎన్నికలవరకు వెయిట్ చేయాల్సిందే.





ఇలాంటి పరిస్ధితుల్లోనే హఠాత్తుగా ఎన్టీయార్ భవన్లో నేతలతో సమావేశమైన చంద్రబాబు పార్టీకి జవసత్వాలు కల్పించేందుకు అందరం కలిసి కృషి చేద్దామనటమే ఆశ్చర్యంగా ఉంది. కేసీయార్ అధికారంలో ఉన్నంతవరకు  చంద్రబాబు రాజకీయాలు తెలంగాణాలో నడవదని గ్యారెంటీగా చెప్పచ్చు. అధికారంలో కేసీయార్ లేకపోతే రాజకీయాలు చాలామలుపులు తిరుగటం ఖాయంకాబట్టి అప్పటి పరిస్ధితిని అప్పుడే చూసుకోవాలి. నిజంగా తెలంగాణాలో టీడీపీ పోటీచేయాలంటే అభ్యర్ధులు కూడా దొరకరు. 





అందుకనే వచ్చే ఎన్నికలవరకు వెయిట్ చేయకుండా చంద్రబాబు నేతల్లో ఉత్సాహం నింపుతున్నారంటే తెరవెనుక ఏదో ప్లాన్ ఉండుండాలి. లేకపోతే నేతలను ఉత్సాహపరిచేందుకు మాత్రమే ఉత్తుత్తి కతలైనా  చెబుతుండాలి. ఈ మధ్యనే ఢిల్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన విందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధితో పాటు చాలామంది హాజరయ్యారు. ఆ విందుకు కూడా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా హాజరయ్యారు. అప్పటి సమావేశానికి ఇపుడు చంద్రబాబు హడావుడికి ఏమన్నా లింకుంటుందా ? ఏమో రాజకీయాల్లో ఎప్పుడేమవుతుందో ఎవరు చెప్పలేరుగా.


మరింత సమాచారం తెలుసుకోండి: