ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. వీరి పాలనపై మెజారిటీ రాష్ట్రాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ వీరిని తలదన్నే బలమైన జాతీయ రాజకీయ పార్టీ లేకపోవడమే ప్రస్తుతం భారతదేశ ప్రజలు చేసుకున్న పాపం అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఎన్నో వివాదాస్పద మరియు ప్రజలకు ఇబ్బందులను కలిగించే నిర్ణయాలు తీసుకుని బోలెడంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ తెలుసుకోకుండా 'మనల్ని ఎవడ్రా ఆపేది' అన్నట్లుగా వారి పాలన కొనసాగుతోంది. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇంకో సారి కూడా కేంద్రంలో బీజేపీ చక్రం తిప్పుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే మరో నెలరోజుల్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ ఎన్నికలను డిసెంబర్ మొదటివారంలో రెండు దశలలో జరపడానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో గత 23 సంవత్సరాలుగా బీజేపీ మాత్రమే అధికారంలో ఉంది. ప్రధాని మోదీ మరియు హోమ్ మినిస్టర్ అమిత్ షా ల సొంత రాష్ట్రము గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం వీరికి చాలా అవసరం. కానీ ఈ సారి అంత సులభం కాబోదని రాజకీయ ప్రముఖులు బీజేపీని హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీలు బీజేపీకి చెమటలు పట్టిస్తున్నారట.

ఇక గత కొంతకాలంగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ రాజకీయాల్లో సక్సెస్ అవుతోంది. దీనికి సంకేతమే పంజాబ్ లో అధికారంలోకి రావడం. ఇకపోతే ఆప్ తరపున సీఎం అభ్యర్థిగా ఈసారి మాజీ జర్నలిస్టు అయిన ఇసుధన్ గాద్వి ని కేజ్రీవాల్ ఎంపిక చేశారు. ఇతనికి వ్యక్తిగా మంచి పేరు ఉండడం మరియు తన సామాజిక వర్గంలో బలమైన నేతగా ఎదగడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఇతను ద్వారక నుండి పోటీ చేయనున్నాడు... ఇతను రైతులకు సపోర్ట్ చేస్తున్న "మహామంతన్" ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. ఈ ఒక్క ప్రోగ్రాం తనను ఎన్నికలలో గెలిపించడమే కాకుండా ఆప్ ను కూడా అధికారంలోకి తీసుకొస్తుందన్న నమ్మకాన్ని ఆప్ అధిష్టానం బలంగా నమ్ముతోంది. ఇక బీజేపీ పాలనపై విసిగిపోయిన ప్రజలు ఈ రాష్ట్రము నుండే తమ వ్యతిరేకతను చూపిస్తారేమో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: