ప్రముఖ సెర్చింగ్ యాప్ గూగుల్ క్రోమ్ లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై క్రోమ్ బ్రౌజర్ నుంచి సైట్లను సందర్శించే సమయం లో పాస్ వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడమే ఈ కొత్త సదుపాయం.. ఇందుకు వీలుగా గూగుల్ పాస్ కీస్ ను ప్రవేశపెట్టింది. పాస్ కీ అన్నది ప్రతి యూజర్ కు ప్రత్యేకమైన ఐడెంటిటి తో కూడుకుని ఉంటుంది. ఇవి వ్యక్తిగత కంప్యూటర్లు, ఫోన్లు లేదా యూఎస్ బీ సెక్యూరిటీ డివైజ్ లలోనే స్టోర్ అవుతాయి. అంటే ఆన్ లైన్ లో ఎక్కడా స్టోర్ కావు.


పాస్వర్డ్ కీస్ ఇలా స్టోర్ అవ్వడం వల్ల ఇక ఆ తర్వాత నుంచి వివిధ వెబ్ సైట్లు, యాప్ లలో పాస్ వర్డ్ అవసరం లేకుండా లాగిన్ అయిపోవచ్చు. దీంతో ప్రతీ పోర్టల్ కు సంబంధించి యూజర్ పాస్ వర్డ్ లను గుర్తు పెట్టుకోవాల్సిన ఇబ్బంది తప్పిపోతుంది. పాస్ వర్డ్ అన్నది ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపును ధ్రువీకరించేందుకు, అనధికారికంగా డేటాను మరొకరు పొందకుండా అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది..


మాములుగా పాస్వర్ద్ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ,పాస్వర్డ్ కీస్ మరొకరికి తెలిసే అవకాశం ఉండదు. సర్వర్ బ్రీచ్ అయినప్పటికీ, ఈ పాస్వర్డ్ కీస్ లీక్ కావు. ఫిషింగ్ దాడుల నుంచి యూజర్ల కు రక్షణ ఉంటుందని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ లో పెట్టింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్యాటర్న్, పిన్ ద్వారా మనం ఫోన్ లో లాగిన అయినట్టుగా, పాస్ కీస్ సాయం తో ఆన్ లైన్ పోర్టళ్లలో లాగిన్ అయ్యేందుకు వీలుంటుంది. గూగుల్ క్రోమ్ లో ఆండ్రాయిడ్, విండోస్ 11, మ్యాక్ ఓఎస్ యూజర్ల కు పాస్వర్డ్ కీస్ అందుబాటు లో వుంది.. సైబర్ నేర గాళ్ళ నుంచి రక్షించేందుకు ఈ ఫీచర్ ను అందిస్తున్నట్లు తెలిపారు..


మరింత సమాచారం తెలుసుకోండి: