జనసేన పార్టీపెట్టి ఎనిమిదేళ్ళవుతున్నా ఇంతవరకు ఏపీలోనే దిక్కులేదు. అలాంటిది వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కూడా పోటీచేస్తామని పార్టీ ప్రకటించటమే చాలా విచిత్రంగా ఉంది. వచ్చే ఏడాది జరగబోయే తెలంగాణా ఎన్నికల్లో 32 నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం ఉందన్నట్లుగా పార్టీ ఇన్చార్జి శంకర గౌడ్ ప్రకటించారు. 32 నియోజకవర్గాలకు కార్యనిర్వాహకులను ప్రకటించారు కాబట్టి ఈనియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నట్లుగా ప్రచారం మొదలైంది.





ఇక్కడ గమనించాల్సిందేమంటే పార్టీ పెట్టి 8 ఏళ్ళవుతున్నా సాధారణ ఎన్నికల్లో తప్ప  ఏపీలో జరిగిన ఏ ఉపఎన్నికలోను పోటీచేయలేదు. సాధారణ ఎన్నికల్లో పార్టీ రాజోలు అసెంబ్లీలో మాత్రమే గెలిచింది. ఇక తిరుపతి పార్లమెంటు, ఆత్మకూరు, బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగితే పోటీచేయలేదు. కాబట్టి పార్టీ బలమెంతో ఎవరికీ తెలీదు. తిరుపతి పార్లమెంటు, బద్వేలులో పోటీచేయటానికి జనసేన ప్రయత్నించినా బీజేపీ పడనివ్వలేదు.





ఇదే సమయంలో తెలంగాణాలో దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్, మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగితే ఒక్కదాంట్లో కూడా పోటీచేయలేదు.  ఎంఎల్సీ ఎన్నికలు జరిగితే అందులోను పోటీచేయలేదు. పార్టీ పెట్టినదగ్గర నుండి పవన్ రాజకీయమంతా కేవలం ఏపీకి మాత్రమే పరిమితమైన విషయం అందరు చూస్తున్నదే. పొరబాటున కూడా తెలంగాణా రాజకీయాల్లో వేలుపెట్టలేదు. కేసీయార్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుందో పవన్ కు బాగా తెలుసు. అందుకనే హోలుమొత్తంమీద అసలు తెలంగాణా రాజకీయాలజోలికే పవన్ వెళ్ళటంలేదు.





అలాంటిది తెలంగాణా ఎన్నికల్లో ఏకంగా 32 అసెంబ్లీల్లో పోటీచేస్తామని చేసిన ప్రకటనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల్లో పోటీచేయాలంటే ప్రత్యర్ధులందరినీ టార్గెట్ చేయాల్సిందే కదా. తెలంగాణాలో పవన్ కు అసలు ప్రత్యర్ధులే లేరు. ఎందుకంటే తెలంగాణా రాజకీయాలనే పట్టించుకోని పవన్ కు ప్రత్యర్ధులు మాత్రం ఎందుకుంటారు ? అలాంటిది హఠాత్తుగా 32 నియోజకవర్గాల్లో పోటీ అంటే ఆశ్చర్యంగానే ఉంది. ఉపఎన్నికల్లోనో లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనో పోటీచేసుంటే పార్టీ బలమేంటో అంచనా ఉండేది. సొంతబలమెంతో అంచనా లేకుండా ఎన్నికల్లో దిగాలని పవన్ డిసైడ్ చేయటమే విచిత్రంగా ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: