మంచోచెడో జనాలకు డైరెక్టుగా కనెక్టవ్వటమే మంచిది. అంతేకానీ ఒకే విషయాన్ని సందర్భానికి తగ్గట్లుగా మారుస్తుంటే జనాలు నమ్మరు. ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం, విశాఖపట్నం రైల్వేజోన్, పరిశ్రమల ఏర్పాటులాంటి అనేక అంశాలపై చంద్రబాబునాయుడు ఇలా మాట్లాడే జనాల్లో క్రెడిబులిటీ పోగొట్టుకున్నారు. ఇపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని పెద్ద శపథమే చేశారు.





ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే ప్రతిపక్షాలు బలహీనపడి అధికార వైసీపీనే లాభపడుతుందని పవన్ ఇప్పటికి చాలాసార్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని కానిచ్చేది లేదని పవన్ పెద్ద ప్రతిజ్ఞే చేశారు. అందుకనే ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇపుడు ప్రతిపక్షాలను ఏకం చేయటానికి ప్రయత్నిస్తున్న పవన్ 2019 ఎన్నికల్లో ఏమిచేశారు ?





అప్పుడు ఏమిచేశారంటే ప్రతిపక్షాల్లో దేనికదే పోటీచేయాలన్నట్లుగా వ్యవహరించారు. ఎందుకంటే చంద్రబాబునాయుడు ప్రయోజనాలు కాపాడటం కోసమే అని ఇప్పటికీ వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. మళ్ళీ చంద్రబాబును సీఎంగా చేయటమే టార్గెట్ గా పవన్ అప్పట్లో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అప్పుడైనా ఇప్పుడైనా లాజిక్ ఒకటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోతే అధికారపార్టీ లాభపడుతుంది. కానీ జరిగిందేమంటే అధికారపార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్షాలన్నింటినీ వైసీపీ చావుదెబ్బకొట్టింది. పవన్ డ్రామాలు బయటపడిన ఫలితమే టీడీపీతో పాటు  జనసేనకు ఘోర పరాభవం.






అంటే పవన్ డబల్ యాక్షన్ జనాలకు అర్ధమైపోయింది. కాబట్టే పోటీచేసిన రెండుచోట్లా ఓడిగొట్టారు. సినిమాల్లో డబల్ యాక్షన్ రోల్ చెల్లుబాటవుతుందేమో కానీ నిజజీవితంలోను, రాజకీయాల్లోను సాధ్యంకాదని పవన్ కు అర్ధంకావటంలేదు. అసలు పవర్ రాజకీమం మొదటినుండి అయోమయంగానే ఉంది. చెప్పింది చేయడు, చెప్పినమాట మీద నిలబడడు, ఒకరోజు చెప్పిందానికి మరుసటి రోజు చెప్పిందినికి పొంతనే ఉండదు. ఇలాంటి మాటలు ఏదైనా నాలుగురోజులు చెల్లుబాటవుతుందంతే. ఈ విషయం ఒకసారి అనుభవంలోకి వచ్చినా పవన్ ఇంకా తన పద్దతిని మార్చుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయాన్ని బాగా అర్ధంచేసుకోబట్టే జగన్మోహన్ రెడ్డి డైరెక్టుగా జనాలతోనే పొత్తని పదేపదే చెబుతున్నది.




మరింత సమాచారం తెలుసుకోండి: