ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు పెద్దలు. ఎందుకంటే ఉల్లి తినడం వల్ల అన్ని లాభాలు ఉంటాయి. అయితే ఈ ఉల్లిపాయ వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు పోతాయి.. రావు. అయితే ఈ ఉల్లిపాయ ధరలు నిన్నటి భారీగా పెరిగాయి. ప్రతి ఒక్కడికి ఈ ఉల్లి మంట బాగా అంటుకుంది. ఇంకా కొంతమంది అయితే ఈ ఉల్లిపాయని కొనడానికి ప్రయత్నించి ప్రయత్నించి గుండెపోటు వచ్చి మరణించారు. 

 

read more : దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఏంటో తెలిస్తే రక్తం ఉడికిపోతుంది!!

 

అలాంటి ఈ ఉల్లిపాయ అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూడా గొడవలు పెట్టేసింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఉల్లి ధరలు అమాంతం పడిపోయాయి. ఎంత అని అనుకుంటున్నారా ? హైదరాబాద్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి కొత్త పంట రావడం ప్రారంభమైంది. దీంతో నేడు హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటాల్‌ ఉల్లి ధర 13వేల నుంచి 14వేల రూపాయలు పలికాయి. 

 

read more : దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఏంటో తెలిస్తే రక్తం ఉడికిపోతుంది!!

 

అయితే వారం రోజుల క్రితం ధరలు క్వింటాల్‌కు 16వేల నుంచి 18వేల రూపాయల వరకు పలికాయి. ఒక పక్క ప్రభుత్వం విదేశాల నుంచి పెదయెత్తున ఉల్లి దిగుమతి చేసుకోవడం ఒక కారణం, మహారాష్ట్ర నుంచి కొత్త పంట కొద్ది కొద్దిగా దిగుమతి అవుతున్న నేపధ్యంలో ధరలు తగ్గినట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇక మరో రెండు వారాల్లో ఉల్లిధరలు సాధారణ స్థితికి చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: