ప్రపంచంలో మేధావుల సంఖ్య పెరిగిపోతుందట.. ఎలాగంటే ఒక సమస్య వచ్చినప్పుడు ప్రతి వారు ఏదో ఒక సలహాను అలా ప్రజల్లోకి విసిరేస్తూ ఇదే నిజం అని భ్రమను కల్పిస్తున్నారు.. అలా చేయడం వల్ల వారేదో గొప్పవారిగా ఫీలవుతున్నారట.. నోటి నుండి వచ్చే మాటకు ఒక్క పైసా ఖర్చు ఉండదు.. ఉచితంగా వస్తుంది కాబట్టి సోదంతా చెబితే గుర్తింపు వస్తుందనుకుంటున్నారు.. ఇకపోతే కరోనా వచ్చినప్పటి నుండి ప్రతి వారు ఎన్నో సలహాలు ప్రచారం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.. అలా వారిచ్చే సలహాలను సైంటిఫిక్‌గా నిరూపించి ప్రజలకు వివరిస్తే బాగుంటుంది..

 

 

లేదంటే కొందరు అమాయకులు ఇదే నిజమని నమ్మి అలాంటి అబద్దపు వార్తలను ఫాలో అవుతే ఎంత నష్టం.. దీనికి ఉదాహరణగా మొన్నటికి మొన్న వచ్చిన వార్త.. యూట్యూబ్‌లో చూస్తూ ఒకతను డెలివరి చేశాడట.. దీనివల్ల అనవసరంగా ఒక ప్రాణం పోయింది.. ఇదే కాకుండా అనారాగ్య విషయాల్లో కూడా చాలామంది ఇలాంటి వాటినే ఆచరిస్తున్నారు.. అందువల్ల ప్రతివారికి ప్రభుత్వం వివరంగా చెప్పవలసి వస్తుంది..

 

 

ఇకపోతే ఈ మధ్య హైడ్రాక్సి క్లోరోక్వీన్ వాడితే కరోనా రాదనే ప్రచారం చాలా జరిగింది.. కొన్ని కొన్ని వార్త పత్రికలైతే విశేషంగా ప్రచారం చేసాయి.. ఈ విషయంలో ప్రభుత్వాలు స్పందిస్తూ.. ఈ హైడ్రాక్సి క్లోరోక్వీన్ ఎవరుపడితే వారు వాడకూడదని, ఇలా వాడటం వల్ల పలు దుష్పరిణామాలకు దారి తీస్తుందని, కేవలం కరోనా సోకిన వారికి మాత్రమే ఈ మందు వాడాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి పేర్కొంది.. ఇది ఒక ప్రత్నామాయం మాత్రమే..

 

 

అంతే కాకుండా కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.. అందులో ఈ విధానం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే పాటించాలి.. కానీ ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా చొప్పించారు కొందరు.. ఇది పూర్తిగా తప్పుడు విధానం అని ప్రభుత్వం చెబుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: