ఏ దుర్మూహూర్తంలో చైనాలోని పుహాన్ నుంచి కరోనా వైరస్ పుట్టుకొచ్చిందోకానీ మనిషి పనుడగడనే ప్రశ్నార్థకంగా మారింది.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 205 దేశాలకు విస్తరించింది.  ప్రపంచ వ్యాప్తంగా 60 వేల మందికి పైగా కరోనా బాధితులు చనిపోయారు. ఇప్పటివరకు 2.50 లక్షల మంది కోలుకున్నారు. కరోనా వైరస్‌ పుట్టిన చైనాలో మొత్తం 3,300 మందికి పైగా ఆ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  చైనాలోని దక్షిణ ప్రాంతంలో కొత్తగా 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అక్కడి  అధికారులు తెలిపారు. నిన్న ఈ 30 కేసులు నమోదుకాగా వారిలో 25 మంది విదేశాల నుంచి వచ్చినవారని చెప్పారు.

 

అంతేకాదు, కరోనా లక్షణాలతో బాధపడుతున్న మరో 62 మందిని అధికారులు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాకరోనా ప్రభావం వీపరీతంగా కనిపిస్తుంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా క‌రోనా గుప్పిట చిక్కి విల‌విల‌లాడుతున్న బ్రిటన్ ప్ర‌జ‌ల‌కు ఆ దేశ రాణి ఎలిజ‌బెత్ ధైర్యం చెప్పారు. క‌రోనా భ‌యంతో విండ్స‌ర్ కోట‌లో సెల్ఫ్ క్వారంటైమ్‌లో ఉన్న ఆమె దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి టెలివిజ‌న్లో ప్ర‌సంగించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. దీన్ని అరికట్టేందుకు అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. క‌రోనా బారిన‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

 

మ‌న‌మంతా క‌లిసిక‌ట్టుగా ఉంటే క‌రోనాను జ‌యించ‌గ‌లం అని స్ప‌ష్టంచేశారు. బ్రిట‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా మృతుల సంఖ్య 5000 చేరుకుంది.   గ‌త ప‌దిరోజులుగా క్వారంటైమ్‌లో ఉన్న ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌కు వ్యాధి త‌గ్గ‌క‌పోవ‌టంతో ఆదివారం హాస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుంటార‌ని, తాము మ‌ళ్లీ క‌లుస్తామ‌ని రాణి అన్నారు. నిద్రాహారాలు మాని రోగుల‌కు సేవ‌లందిస్తున్న వైద్య సిబ్బంది, ఇత‌ర అత్య‌వ‌స‌ర సేవ‌ల సిబ్బందిని రాణి అభినందించారు.

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: