ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రధాని మోడీ కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో టెస్టులు పెంచాలని ఆదేశించారు. ముంబై నగరంలో కూడా కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటంతో కరోనా టెస్టులు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏప్రిల్ మే నెలల్లో ముంబై మహానగరంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం కూడా ముంబై నగరంలో కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కరోనా కిట్స్ లేక ముంబయి ప్రభుత్వం నానా ఇక్కట్లు పడుతుంది. ప్రస్తుతం ముంబై నగరంలో రోజుకి ఎంత 9000 కరోనా టెస్టులు మాత్రమే చేస్తున్నారు. గతంలో ప్రతి రోజుకి 15వేల కరోనా టెస్టులు చేసేవారు. అయితే ఈ నేపథ్యంలోనే పాడైపోయిన 2లక్షల కరోనా టెస్టింగ్ కిట్స్ లను ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు పంపిణీ చేశారు. దీంతో ఎవరికి పాజిటివ్, ఎవరికి నెగిటివ్ ఉందో తెలియక మళ్ళీ కరోనా టెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చే రెండు వారాల్లో కరోనా టెస్టింగ్ కిట్స్ లేక గడ్డు రోజులు రాబోతున్నాయని ముంబయి ప్రభుత్వ అధికారులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.


ఇప్పటి వరకు 12 లక్షల పనికిరాని కరోనా టెస్టింగ్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం నుండి తాము పొందామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దసరా పండుగ ఆసన్నం అవుతున్న నేపథ్యంలో కరోనా టెస్ట్ లు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి ఉంది కాని టెస్టింగ్ కిట్స్ లేవు.


మహారాష్ట్ర ప్రభుత్వం, బిఎంసి రెండూ తమ వద్ద పరీక్షా కిట్లు తక్కువగా ఉన్నాయని తెలుసుకున్నప్పటికీ, పండుగ సీజన్లో పరీక్ష నిరంతరాయంగా కొనసాగుతుందని నిర్ధారించడానికి తాజా వాటిని ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉంది.


రాష్ట్ర ప్రభుత్వం మరియు బిఎంసి ఒకదానికొకటి తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి తెలియ చేసినప్పటికీ ఏ సహాయం అందడం లేదంట. ఎక్కువగా టెస్టులు చేయకపోతే మిగతా వారు కూడా కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. కరోనా రోగుల అందరినీ ఎప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించి వారికి నయం చేస్తే కానీ పెద్ద ప్రమాదం తప్పదు. అయితే ప్రస్తుతం ముంబయి నగరం కరోనా కిట్స్ లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: