సాధారణంగా అందరికీ తలనొప్పి వస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక్కడ ఒక వ్యక్తికి కూడా తలనొప్పి వచ్చింది. తలనొప్పి తగ్గడానికి మాత్రలు కూడా వాడాడు. ఇక తల నొప్పి తగ్గలేదు కదా.. ఇంకా ఎక్కువైంది. దీంతో డాక్టర్ దగ్గరికి వెళ్లాడు సదరు వ్యక్తి. డాక్టర్ కూడా మందులు రాసి ఇచ్చిన దాంతో కూడా తల నొప్పి తగ్గలేదు. మళ్లీ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్లి స్కాన్ చేసి చూడగా వారు ఒక్కసారిగా షాకయ్యారు. కేవలం మెదడు  మాత్రమే కాదు ఛాతి  ఊపిరితిత్తుల భాగాల్లో కూడా ఏకంగా ఏడు వందలకు పైగా పురుగులు ఉన్నట్లుగా రిపోర్టులో  రావడంతో వైద్యులు అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 అయితే ఇక పరాన్నజీవులు కనిపించడంతో వైద్యులు మరింత లోతుగా అతని మెదడును స్కాన్ చేయగా అవి సాధారణ పరాన్నజీవులు కావని... రిబ్బెన్ లా  పొడుగుగా ఉండే పరాన్నజీవులని  వైద్యులు గుర్తించారు. చైనాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. మామూలుగానే చైనాలో ఏది పడితే అది తింటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. బిజియాంగ్  ప్రావిన్స్ కు చెందిన ఓ వ్యక్తికి ఈ సమస్య ఏర్పడింది. అయితే టేప్ వార్మ్స్ పరాన్న జీవుల శరీరంలో  వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతాయని.. అయితే ఒకే వ్యక్తి శరీరంలో అన్ని పరాన్నజీవులు ఉండటం చూసి ఆశ్చర్యపోయినట్లు  తెలిపారు.


 బాధితుడు నెల రోజుల కిందట పూర్తిగా ఉడకని మాంసం తినడం కారణంగానే ఇలా పరాన్నజీవులు అతని శరీరంలోకి చేరి ఉంటాయని డాక్టర్లు అంచనా వేశారు. అయితే ఈ టేప్ వార్మ్స్ పురుగులు ఎక్కువగా పంది మాంసం లో ఉంటాయని సరిగ్గా ఉడికించుకుండా తినడం కారణంగా ఏకంగా  కేంద్ర నాడీ వ్యవస్థ లోకి చేరుకుంటాయి అంటూ తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రతి ఒక్కరు మాంసాన్ని తీసుకునేటప్పుడు బాగా ఉడికించిన తర్వాతనే తీసుకోవడం ఎంతో మంచిది అంటూ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: