జగన్ గురించి ఏపీలో ఒకలా సౌండ్ వినిపిస్తే దేశంలో మరోలా రీ సౌండ్ వస్తుంది. జాతీయ స్థాయిలో పాపులారిటీలో మూడవ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. విపక్షాలు తెల్లరిలేస్తూనే విమర్శలు చేస్తూ అధికార పార్టీని బదనాం చేయాలని చూస్తాయి. దాంతో ఏపీలో ఏమీ జరగడంలేదనే అంతా అనుకుంటారు. ఇక జగన్ దైనందిన పాలన పక్కన పెడితే ఆయన కొన్ని విషయాల్లో తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా పాకుతున్నాయి.

దిశ చట్టం విషయం అయితే సగం రాష్టాలు ఏపీ నుంచి వివరాలు కోరాయి. వాలంటీర్ల వ్యవస్థ‌ గురించి కేరళ సర్కార్ వాకబు చేయడమే కాదు, కరోనా వేళ తమ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నియామకాలు చేసింది. ఇక అస్సాం రాష్ట్రానికి చెందిన అధికారులు ఏపీకి వచ్చి వాలంటీర్ల వ్యవస్థ మీద తాజాగా అధ్యయనం చేస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు జగన్ బీసీల కోసం ఒకేసారి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం దేశంలోనే సంచలనం అయింది. అంతెందుకు పొరుగున ఉన్న తమిళనాడులో దీని మీద పెద్ద రాజకీయ రచ్చ సాగుతోంది. తమిళనాడులో విపక్ష నేత రాందాస్ అయితే దీని మీద జగన్ సర్కార్ ని పొగుడుతూ లేఖ కూడా రాశారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ తమిళనాడు లో డీఎంకే సహా విపక్షాలు అన్నీ కూడా అచ్చం ఏపీ లో చేసినట్లుగానే బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయమంటున్నారు. దీని మీద విపక్షం అంతా కలసి అధికార పక్షాన్ని ఇరుకునపెడుతోంది.

బీసీలు పెద్ద ఎత్తున తమిళనాడులో ఉన్నారు. వారి ఓట్ల కోసం ఇపుడు ప్రతిపక్షాలు జగన్ పాలసీని అమలు చేయమని కోరడంతో అధికార అన్నాడీఎంకే ఇబ్బందులో పడిపోయిందిట. ఎందుకంటే తమిళనాట బీసీలు పెద్ద ఎత్తున ఉన్నారు. ముంగిట్లో ఎన్నికలు ఉంచుకుని అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అంత సులువు కాదు, తేడా వస్తే బీసీలు టాప్ రేపుతారు. దాంతో జగన్ పెద్ద జగడమే తెచ్చారని అధికార పార్టీ తాపీగా నిట్టూరుస్తోందిట.


మరింత సమాచారం తెలుసుకోండి: