తెలంగాణ రాజకీయాలను ఊపేసిన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే.  అన్ని పోలింగ్ కేంద్రాల్లో సజావుగానే  పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులతోపాటు ఎంతో మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూ కట్టారు ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు.



 అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రస్తుతం... కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక అంతే కాకుండా పోలింగ్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఓటర్లు అందరూ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ జిహెచ్ఎంసి ఎన్నికలను  అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి  అన్న విషయం తెలిసిందే... ఈ క్రమంలోనే ప్రస్తుతం అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. అయితే హైదరాబాద్ లో  శరవేగంగా కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికే ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.



ఓవైపు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళుతూ కరోనా  వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే అభివృద్ధి కోసం సరైన అభ్యర్థికి ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు గ్రేటర్ పరిధిలోని ఓటర్లు. అటు పోలింగ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడా మాస్కులు శానిటైజర్ లు ఫేస్ షీల్డులు లతో కూడిన కిట్ అందజేశారు అధికారులు. ఇలా కరోనా  జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. అయితే అభ్యర్థులు అందరిలో ప్రస్తుతం టెన్షన్ నెలకొంది. ప్రజలు ఎవరిని గెలిపించేందుకు నిర్ణయించుకున్నారు అని  అభ్యర్థులందరూ ప్రస్తుతం టెన్షన్ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: