గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం విషయంలో రాజకీయ పార్టీలు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రచారం విషయంలో చాలా వరకు అప్రమత్తంగా నిర్వహించారు. అయితే కొంత మంది మాత్రం ఇప్పుడు కీలక సమయంలో వెనకడుగు వేయడంతో రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కీలక పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం చివరి నిమిషం వరకు తీవ్రంగా చేసినా సరే ఓటర్లను పోలింగ్ బూత్ కి తరలించే విషయంలో మాత్రం చాలావరకు విఫలమయ్యారు. బస్తీ ప్రాంతాల్లో కూడా చాలావరకు అభ్యర్థులు ప్రజలను పోలింగ్ బూత్ కి తరలించ లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. హైదరాబాద్ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల్లో కూడా పోలింగ్ చాలా మందకొడిగా సాగుతోంది. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న హైదరాబాదు నగరంలో ఈ దుస్థితి ఏంటి అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 30 శాతం వరకు పోలింగ్ నమోదైనది. పోలింగ్ ఎంత వరకు నమోదు అవుతుంది అనేది ఎన్నికల సంఘం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇప్పుడు క్యూలైన్లో నిలబడి ఉన్నారు.

ఎన్నికల సంఘం సిబ్బంది అయితే కొన్ని చోట్ల నిద్రపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో వైరల్ గా మారాయి. రాజకీయ పార్టీలు ఎంతో దృష్టిసారించిన ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఈ విధంగా నమోదు కావడం పై చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఓటు వేయడానికి ముందు వస్తుంటే నగర ప్రాంతాల్లో ఎందుకు ముందుకు రావటం లేదని అసలు రాజకీయ పార్టీలతో ఇబ్బందా లేకపోతే ప్రజల్లోనే ఇబ్బందా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: