సాధారణం గా అడవిలో కొన్ని రకాల జంతువులు ఎంతో అందం గా కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  అయితే అడవిలోఎంతో అందంగా కనిపించే జంతువులలో జింక కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. అడవిలో జింకలు చూసారు అంటే ఎవరైనా మురిసిపోతూ ఉంటారు. అంత అందంగా కనిపిస్తూ ఉంటాయి. అంతే కాకుండా ఎంతో చురుకుగా కూడా ఉంటుంది జింక. అందుకే జింకలను చూసేందుకు చాలా ఇష్టపడుతుంటారు.  ఇక జింకలు చెంగు చెంగున గెంతుతూ సందడి చేస్తూ ఉంటే ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది.


 సాధారణం గా అయితే ఒక జింక 130 కేజీల వరకు ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇది సర్వ సాధారణం గా ఏ జింకలో  అయినా ఇలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా జింక  కేవలం ఒక కిలో  ఎనిమిది వందల గ్రాములు మాత్రమే ఉంది అంటే నమ్ముతారా. కానీ ఇది నిజమేనండోయ్. సాధారణంగా ఇప్పటివరకు మీరు జింకను చూసి ముచ్చట పడి ఉంటారు. కానీ ఇప్పుడు ఈ జింక ని చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. స్పెయిన్ లోని బయో పార్క్ ప్యూంజి రోలా పార్కులో మూషిక జింక ఆశ్చర్యానికి గురి చేస్తుంది.



 ఇది  పుట్టినప్పుడు కేవలం వంద గ్రాములు మాత్రమే ఉండేది.  ఇవి చూడటానికి అచ్చంగా ఎలుకలు లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి చిన్న జింకలు  ఆసియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ జింకలు ఎక్కువగా రాళ్ల చుట్టూ తిరుగుతూ ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయట. అంతేకాదు దట్టమైన అడవుల్లో చెట్లకు తొర్రల్లో  నివసిస్తూ ఉంటాయి. నీటి లభ్యత ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని మరీ అక్కడే జీవిస్తూ ఉంటాయి. అయితే ఈ చిన్న జింకలు పరిమాణం  కేవలం 18 ఇంచులు  మాత్రమే పెరుగుతాయి అచ్చంగా కుందేలు సైజు వరకు ఉంటాయి చిన్న జింకలు.

మరింత సమాచారం తెలుసుకోండి: