బీహార్ రాష్ట్రంలో రానురాను మానవ హక్కులకు స్థానం లేకుండా పోతుంది. సాధారణంగా ఇక్కడి పరిస్థితులను సినీ పరిశ్రమలో చూపిన విధంగా నేరప్రపంచానికి పునాదిగా మారుతుంది. ఎక్కడ ఏ నేరం జరిగినా దాని మూలాలు ఇక్కడే తేలుతుండటం పట్ల అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గన్ కల్చర్ తారాస్థాయికి ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే కావచ్చు. ఒక స్థాయిలో బీహారీయులు అంటేనే ఇతర ప్రజానీకం భయబ్రాంతులకు గురయ్యే స్థాయికి అక్కడ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. బీహార్, ఇక్కడ నెలలో అనేక ఖనిజ నిక్షేపాలు లభిస్తుండటంతో మాఫియా నీడలో అక్కడ ప్రజలు బ్రతికేయాల్సి వస్తుంది.

తమకు కొన్ని హక్కులు ఉంటాయి అనే కనీస విషయం మరిచిపోయి బానిసలుగా అక్కడి ప్రజలు జీవితం సాగిస్తున్నారు. ఎవరైనా నోరు తెరిచి హక్కుల కోసం అడిగితే వాళ్ళపని అంతటితో సరి. దాదాపు ఇవన్నీ కొన్ని మాఫియా నేపథ్యం ఉన్న చిత్రాలలో చూశాం, దాదాపు అదే తరహాలో ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ ఎడారి ప్రాంతంగా ఉండటంతో కనీస అవకాశాలు కూడా లభించని పరిస్థితులలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలలో వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  దాదాపు ఎక్కడ ఏ కూలివాళ్ళను కదిలించినా అందులో బీహారీలు ఎక్కువ ఉంటారు.  

ఇలాంటి పరిస్థితులను ఎదిరించి భవిష్యతరాలకు మంచి జీవితాన్ని అందించాలని కొందరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారిపై దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక సమాచార హక్కు కార్యకర్త హత్య చోటుచేసుకుంది. తూర్పు చంపారన్ జిల్లాలోని హర్సిద్ది లో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆయన పోరాటాలు చేస్తూ ఉన్నారు. దీనితో అతనిపై దాడులు మొదలయ్యాయి. తాజాగా గుర్తు తెలియని దుండగులు ఆయనను కాల్చి చంపేశాయి. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు అధికారులు. దీనిపై మరో కార్యకర్త స్పందిస్తూ, హక్కుల కోసం పోరాడే వారిపై దాడులు చేయడం ఘోరం అని అన్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించి వదిలేయడం సరికాదని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: