ఏపీలో పరిషత్ ఎన్నికలు ముగిసిన తర్వాత చైర్మన్ ల సందడి మొదలయింది. అధికార పార్టీలో  విభేదాలు ఈ విషయంలో తారా స్థాయిలో ఉన్నాయి. విపక్షం గెలిచిన ప్రాంతాల్లో కూడా అధికార పార్టీ తన హవా కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు వివాదాస్పదం అవుతున్నాయి. అధికార పార్టీ తన ప్రభావాన్ని గట్టిగానే చూపించింది. జిల్లా పరిషత్‌ చైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.  రాష్ట్రంలో అన్ని పరిషత్‌ కార్యాలయల్లో సమావేశం కానున్నారు జడ్పీటీసీలు.

ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లను జడ్పీటీసీ లు ఎన్నుకుంటారు అని ఎన్నికల సంఘం ప్రకటించింది.  అభ్యర్థల నుంచి ఉదయం 10 గంటలలోపు నామినేషన్లు స్వీకరణ జరిగింది.  మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనంతరం కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది.  మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్మన్‌, ఇద్దరు వైస్ ఛైర్మన్ల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం జరుగుతుంది అని ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను దక్కించుకొనున్న అధికార వైసీపీ... ఎంపీపీల మీద కూడా పూర్తి ఫోకస్ పెట్టింది.కొన్ని చోట్ల పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధిష్టానం సమస్యలను పరిష్కరిస్తుందని అంటున్నారు. స్థానిక నాయకులు కూడా ఈ అంశానికి సంబంధించి ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు.

 రిజర్వేషన్లు అనుసరించి ఇప్పటికే అభ్యర్థుల పేర్లను అధికార పార్టీ ఖరారు చేసుకుంది. అయితే ఇందులో అధికార పార్టీ పై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. పార్టీ ని నమ్ముకున్న వారికి న్యాయం జరగడం లేదని అంటున్నారు. జడ్పీ ఛైర్మన్/ఛైర్‌పర్సన్‌ పేర్లను వరుసగా చూస్తే..

శ్రీకాకుళం... పిరియా విజయ

విజయనగరం....    మజ్జి శ్రీనివాస్

విశాఖపట్నం...    అరిబీరు సుభద్ర

తూర్పుగోదావరి... విప్పర్తి వేణుగోపాల్

పశ్చిమగోదావరి... కౌరు శ్రీనివాస్

కృష్ణా... ఉప్పాళ్ల హారిక

గుంటూరు... క్రిస్టినా

ప్రకాశం... బూచేపల్లి వెంకాయమ్మ

నెల్లూరు... ఆనం అరుణమ్మ

కర్నూలు.... వెంకట సుబ్బారెడ్డి

చిత్తూరు... వి. శ్రీనివాసులు

కడప... ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి

అనంతపురం...    గిరిజ

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp