చంద్రబాబు హయాంలో ముద్రగడ పద్మనాభం ను ఎన్నో విధంగా చిత్ర హింసలు పెట్టిన‌ప్పుడు ప్ర‌శ్నించావా అంటూ కృష్ణ‌ పవన్ కళ్యాణ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు పోసాని ముర‌ళీ. నీకు ప్రేమ ఉన్నప్పుడు చంద్ర బాబుని ఇంద్రుడు అంటావు లేకపోతే తిడతావంటూ మండిప‌డ్డారు. పవన్ నువ్వు ఏ పార్టీతో సరిగ్గా వున్నావని, ఏ పార్టీని మిగిల్చావంటూ ఎద్దేవా చేశారు.


పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి కాదు, రాజకీయంగా ఎన్నో తప్పులు ప‌వ‌న్ చేస్తున్నాడంటూ మండిప‌డ్డారు. తాను ఓన్ టాలెంట్ తో పైకి వచ్చానంటూ పోసానీ చెప్పుకొచ్చారు. చిరంజీవి గారు సంస్కార వంతుడు అని, చిరంజీవి ఇంట్లో అడపడిచుల్ని గురించి అసాసినెట్ చేస్తే నువ్వు ఎక్కడ ప్రశ్నించావు అని నేను ప్రశ్నించాను అందుకే అప్పుడు వాళ్ళు నన్ను చంపుతా అన్నారు అంటూ గుర్తు చేశారు.


పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు ఎక్కడ ప్రశ్నించాలో తెలీదు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జగన్  మంచి పనులు చేస్తున్నారు అందుకే నాకూ జగన్ అంటే ప్రేమ అని పేర్కొన్నారు పోసాని. పవన్...నీ రెమ్యునరేషన్ ఎంత 10 కోట్లా...లేక 50 కోట్లా.. అంటూ, నీ రెమ్యునరేషన్ పది కోట్లు అయితే నీతో నేను నాలుగు సినిమాలు చేస్తాను  అంటూ చెప్పారు.  పవన్ సినిమాలకు టిక్కెట్ రెట్లు రూ. 500, రూ.1000 అంటే  ఏంటి.. మధ్య తరగతి మరియు సామాన్యుల ను హింసించడమే కదా అంటూ ప్ర‌శ్నించారు.


హీరోలు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వార‌ని, వాళ్లు ఏ రోజూ డిస్ట్రిబ్యూషన్ విషయంలో, డబ్బుల విషయాల్లో వేలు పెట్టే వారు కాదని చెప్పారు. వారు నిజ జీవితంలో ను తెర జీవితం లోనూ రియల్ స్టార్ లు అంటూ పొగిడాడు పోసాని. పవన్ కళ్యాణ్ నీకు ఏ అర్హ‌త‌లు ఉన్నాయ‌ని జగన్ నీ తిడుతున్నావు అంటూ ప్ర‌శ్నించారు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్ కులాలను రెచ్చకొడుతున్నాడ‌ని ఆరోపించారు.  నువ్వు దిల్ రాజు పేరు తీసావు  అయన దగ్గర వేరే కులాల వాళ్ళు కూడా ఎంతో మంది చేస్తున్నారు అని చెప్పాడు.

35 ఏళ్ల నుంచి చిరంజీవిని చూస్తున్నాను, ఆయ‌న‌ ఒక్కసారి అయినా ఎవరిని అయినా ఒరేయ్ అన్నాడా అని ఆయ‌న్ను చూసి నేర్చ‌కో అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సూచించారు. ఏ కారణం లేకుండా జగన్ ను ప‌వ‌న్ తిడుతున్నాడ‌ని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: