వైసిపి పార్టీ ఈసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా అధికారంలోకి రావడం ధీమా అంటూ తెలియజేస్తున్నారు. క్యాడర్ ని కూడా ఖుషీ చేయడానికి జగన్ కూడా ఇటీవలే కాలంలో రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని నెలల నుంచి జమిలీ ఎన్నికలు 2027 లో వస్తాయనే విధంగా వినిపిస్తున్నాయి. కానీ మరొకవైపు రెండేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంటుందనే విధంగా వినిపిస్తున్నాయి. రెండేళ్ల తర్వాత అన్ని గ్రామాలకు కూడా తిరుగుతామని చెప్పడంతో కన్ఫ్యూజన్ లో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు.


జమిలి ఎన్నికలు వస్తాయని గతంలో అటు పెద్దారెడ్డి, బొత్స తదితర నేతలు కూడా మాట్లాడారు. అయితే అందుకు  తగ్గట్టుగా ఆధారాలు అయితే లేవు కానీ కేంద్రం నుంచి ఎన్నికలకు సంబంధించి అప్డేట్ వచ్చిందంటే చాలు జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకువస్తున్నారు. అయితే అలాంటి ఛాన్స్ లేదనే విధంగా చాలామంది నేతలు చెబుతున్నారు. అందుకే 2028లో జగన్ మళ్ళీ పాదయాత్ర ప్రారంభించబోతున్నారని అందుకు సాక్ష్యం ఇదే అంటూ తెలుపుతున్నారు.2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించి సంకేతాలు కూడా పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించినట్లు సమాచారం.


మరో రెండేళ్ల పాటు పూర్తి ప్రణాళికలను సైతం సిద్ధం చేసుకుని ఈసారి ఎన్నికలలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా రాబోయే సర్పంచ్ ఎన్నికలలో కూడా వైసీపీ పార్టీ సత్తా చాటడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి చాలామంది నేతలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ తీరుని  గెలిచిన తర్వాత మార్చుకోవాలని గతంలో లాగా ఉంటే కుదరదు అంటూ తెలియజేస్తున్నారట. కార్యకర్తలను నేతలను గుర్తుంచుకోవాలి అంటూ తెలియజేస్తున్నారట. అలాగైతేనే ఈసారి తమ వెంట నడుస్తామని నేతలు కార్యకర్తలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే అటు కార్యకర్తల విషయంలో నేతల విషయంలో జగన్ ఎన్నోసార్లు ప్రెస్మీట్లో తెలియజేశారు. జగన్ 2.O అనేది కేవలం కార్యకర్తల కోసమే ఉంటుంది అన్నట్లుగా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: