2024 ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటుతో సగం విజయం సాధించగా సూపర్ సిక్స్ హామీలు ప్రకటించడంతో మరింత విజయాన్ని అందుకునేలా చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అమలు చేయబోతున్నారు.


అలాగే గత కొన్ని నెలలుగా మహిళలకు ప్రతినెల రూ .1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారనే విషయంపై మహిళలు చాలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తాజాగా టిడిపి ఎంపీ కేసినేని చిన్ని చెప్పిన వ్యాఖ్యలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవలే ఒక సభ లో మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని మొదలు పెట్టబోతున్నామని ఆ తర్వాత స్త్రీ నిది పథకాన్ని కూడా అమలు చేసి ప్రతి నెల రూ .1500 రూపాయలు ఏడాదికి రూ 18,000 చొప్పున కూటమి ప్రభుత్వం ఇవ్వబోతున్నదంటూ తెలియజేశారు. కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాంటివి అంటూ తెలియజేశారు.


అయితే మహిళల స్త్రీనిధి పథకం మాత్రం ఎప్పుడు అమలు చేస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ త్వరలోనే అమలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేస్తూనే మరొకవైపు సంక్షేమ పథకాలను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకువెళ్తున్నారు సీఎం చంద్రబాబు. గడిచిన రెండు మూడు నెలల క్రితం కొంత మెరకు కూటమి ప్రభుత్వం పైన నెగెటివిటీ ఏర్పడిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా అమలు చేయబోతున్నట్లు కనిపిస్తూ ఉండడంతో మళ్లీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలను కూడా భర్తీ చేయడానికి పలు రకాల సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: