విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని శివనాథ్ ( చిన్ని ) తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పంచాయతీ క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ పంచాయతీని ముగించాలని ... అవసరమైతే ఒకరిని ... లేకపోతే ఇద్దరినీ వదిలించుకోవాలని టిడిపి పెద్దలు గట్టి నిర్ణయానికి వచ్చారు. వీరితో మంచిగా ఉంటే ఇలాగే చలరేగిపోతారని చివరకు క్రమశిక్షణ లేకుండా పార్టీలో అందరూ అదే బాటలో వెళతారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే క్రమశిక్షణ కమిటీని రంగంలోకి దింపారు. టిడిపి క్రమశిక్షణ కమిటీ 4వ తేదీన వీరితో సమావేశం కానుంది. ఉదయం కొలికిపూడి శ్రీనివాసరావును పిలిచారు. ఆయన ఎంపీపై ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు. వాటికి ఆధారాలను సమర్పించమని అడిగే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. అదే సమయంలో ఎంపీ చిన్ని బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా క్రమశిక్షణతోనే ఉన్నారు.
కానీ తిరువూరులో రాజకీయాలను ఆయన సెటిల్ చేయడంలో విఫలమయ్యారు. కొలికపూడి విషయంలో ఆయన మరింత రెచ్చగొట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయంతో పార్టీ పెద్దలు ఉన్నట్టుగా చెబుతున్నారు. వీటిపై క్రమశిక్షణ కమిటీ విచారించి చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తారు. ఆ నివేదికపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారు. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇతరులు క్రమశిక్షణతో ఉంటారని లేకపోతే టిడిపిలో మిగిలిన నేతలకు కూడా ... ఈ వైరస్ పాకీ వారు కూడా బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి