కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను తెలంగాణ ఆర్థిక‌శాఖ మంత్రి త‌న్నీరు హరీష్ రావు మ‌ర్యాదు పూర్వ‌కంగా క‌లిసారు. శుక్ర‌వారం కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో తెలంగాణ నుంచి ఆర్థిక మంత్రి హోదాలో త‌న్నీరు హ‌రీష్‌రావు పాల్గొన్నారు. ఈ మీటింగ్ గోవాలో జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్యక్ష‌త‌న జ‌రిగింది. కౌన్సిల్ స‌మావేశం  విరామ స‌మ‌యం సంధ‌ర్భంగా హ‌రీష్‌రావు నిర్మ‌లా సీతారామ‌న్‌ను ప్ర‌త్య‌కంగా క‌లిసి పుష్ప‌గుచ్చం అందించాడు.


ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఆర్థిక‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంద‌ర్భంగా త‌న్నీరు హ‌రీష్‌రావును కేంద్ర‌మంత్రి నిర్మ‌ల అభినందించారు. హ‌రీష్‌రావు కేంద్ర‌మంత్రిని క‌లిసిన సంద‌ర్భంగా పొగాకు ఉత్ప‌త్తుల‌పై ఉన్న జీఎస్టీ రేట్ల‌ను త‌గ్గించాల‌ని కోరార‌ట‌. తెలంగాణ‌లో సుమారు బీడీ కార్మికులు సుమారు 5ల‌క్ష‌ల మంది జీవ‌నోపాధి పొందుతున్నార‌ట‌.


ఈ బీడీ కార్మికుల శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ రేట్ల‌ను త‌గ్గించి బీడీ కార్మికుల‌ను ఆదుకోవాల‌ని హరీష్‌రావు కేంద్ర‌మంత్రి దృష్టికి తేగా ఆమే సానుకూలంగా  స్పందించిన‌ట్లు తెలిసింది. వాస్త‌వానికి తెలంగాణ‌లో బీడీ ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే 5ల‌క్ష‌ల మంది జీవ‌నోపాధి పొందుతున్నారు. కానీ అన‌ధికార లెక్క‌ల ప్ర‌కారం అంత‌క‌న్నా ఎక్కువ మందే ఈ కుటీర  ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి మ‌హిళ‌లు జీవిస్తున్నారు. అనేక మంది బీడీ ప‌రిశ్ర‌మ‌ను కుటీర ప‌రిశ్ర‌మ‌గా మార్చుకుని జీవ‌నోపాధి పొందుతున్నారు.


అయితే పొగాకు ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీలో ఉన్న రేట్ల ప్ర‌భావంతో బీడీ ప‌రిశ్ర‌మ కుదేల‌వుతుంది. ఉత్త‌ర తెలంగాణ‌లోని జిల్లాల్లో చాలా మంది దీనిపై ఆధార‌ప‌డి జీవ‌నం సాగిస్తున్నారు. ముఖ్యంగా క‌రీంన‌గ‌ర్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో బీడీ కార్మికులు చాలా ఎక్కువ‌. దీంతో హ‌రీష్‌రావు కేంద్ర‌మంత్రిని బీడీ ఉత్ప‌త్తుల‌పై రేట్లు త‌గ్గించాల‌ని కోరి బీడీ ప‌రిశ్ర‌మ ను కాపాడుకోవాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: