ఆశ ఉండొచ్చు కానీ, అత్యాశ మాత్రం పనికి రాదు అని పెద్దలు ఊరికే ఊసిపొక అయితే చెప్పరు కదా ! కానీ ఇప్పుడు అటువంటి సూత్రాలు, నియమాలు ఎవరికైనా పనికొస్తాయి కానీ నా దగ్గర పప్పులు ఉదకవమ్మా అంటూ మన సెంద్ర బాబు పెద్ద పెద్ద అవుడియ లు వేసేసే పనిలో ఉన్నారు. ఏపీలో పడుతూ లేస్తూ, లేస్తూ పడుతూ ఉండడం తో అందరూ అయ్యో పాపం అంటూ జాలి, దయ చూపించేస్తున్నారు. ఏదో ఒకరకంగా ఏపీలో పరుగులు పెట్టించాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలు తన 40 ఇయర్స్ అనుభవాన్ని మొత్తం రంగరించి, జనాలు, పార్టీ నాయకులకు ఏదోరకంగా క్రెడిట్ తీసుకురావాలి అని బాబోరు ఆరాట పడిపోతున్నారు.
అయితే బాబుకు ఏ అవకాశం దక్కకుండా అన్ని విషయాల్లోనూ పైచేయి సాధిస్తూ,
ఏపీ సీఎం
జగన్ రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ వ్యవహారాలతో తెలుగుదేశం పార్టీలోనూ నిరసన నిస్పృహలు అలుముకున్నాయి. ఈ వ్యవహారం ఇలాగే సాగితే, పార్టీలో తాను తప్ప ఎవరూ ఉండరు. అనే భయం బాబులో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. అయినా బాబు మొత్తం అంతా తనదే పైచేయి కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాబు ఎంత కష్టపడినా, మరెన్ని రకాల ఎత్తుగడలు వేసినా, పార్టీని ఒక ఒడ్డున పడేయడం కష్టమైన పని అనే విషయం బాబుకు ఒక పక్క అర్థమవుతున్నా,
పార్టీ జనాలు మాత్రం ఆ విషయం అర్థం అవ్వకుండా తిమ్మిని బమ్మిని చేస్తూ, మసిపూసి మారేడు కాయ చేస్తూ,
పార్టీ నాయకుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక్కడ సంగతి ఇలా ఉంటే బాబు ఎప్పుడు వదిలేసిన తెలంగాణలో పార్టీని అధికారంలోకి నడిపించాలని ఫిక్స్ అయిపోయారు. ఆంధ్రలో అధికారం లేకపోయినా, తెలంగాణలో అధికారం దక్కుతుందని ఆశ పెరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకే పేరుకే తప్ప ఉనికిలో లేని
తెలంగాణ లో ఆ పార్టీని పరుగులు పెట్టించాలని బాబోరు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు . ఈ మేరకు అక్కడ ఎన్నో సొంత ఆరోపణలు ఎదుర్కుని అధ్యక్షుడిగా పదవి పొందిన ఆ
రమణ ను బతిమిలాడుకునే పనిలో పడిపోయారు. కారుని బీటవుట్ చేద్దామనే ఆశా, అత్యాశ సైకిల్
పార్టీ అధ్యక్షుడిలో పెరిగిపోవడం నిజంగా సంచలనమే.