
జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మద్దతుదారుల దారుణ ఓటమిపై చంద్రబాబునాయుడులో కన్నా ఎల్లోమీడియా యాజమాన్యంలోనే ఎక్కువ బాధ కనబడుతోంది. ప్రతి ఆదివారం కొత్తపలుకు పేరుతో రాసే చెత్తపలుకులో తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పెద్ద పిలుపేఇచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో ఎలాగున్నా కనీసం వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా వైసీపీని ఓడగొడితే విశాకపట్నం ఉక్కు పరిశ్రమ సెంటిమెంట్ జనాల్లో ఉందని రుజువవుతుందట. ఒకవేళ వైసీపీనే గెలిస్తే జనాల్లో ఉక్కు సెంటిమెంటుకు నీళ్ళొదులుకోవాల్సిందే అని వార్నింగ్ తో కూడిన బాధ ఎక్కువగా కనబడుతోందట. అమరావతి ప్రాంతంలో జనాల సెంటిమెంటు లేదనే విషయాన్ని రుజువు చేసేందుకు గుంటూరు, విజయవాడ నగర పాలకసంస్ధల్లో గెలుపుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెగ బాధపడిపోతున్నారు.
నిజానికి అమరావతి సెంటిమెంటును రాష్ట్రమంతా పులమాలని చంద్రబాబునాయుడుతో పాటు ఎల్లోమీడియా తెగ ప్రయత్నించింది. అయితే అమరావతికి భూములిచ్చిన 28 గ్రామాల్లోనే ఉద్యమం గురించి పూర్తిగా పట్టించుకోవటం లేదు. మరి మిగిలిన రాష్ట్రంలో అమరావతి సెంటిమెంటు ఎందుకుంటుంది ? రాష్ట్రాన్నంతా ఎండగట్టి ఒక్క అమరావతిని మాత్రమే డెవలప్ చేయాలన్న చంద్రబాబు ఆలోచనను జనాలు 2019లో తిప్పి కొట్టినా ఎల్లోమీడియాకు బుద్ధి రాలేదు. సరే అప్పుడప్పుడు అమరావతి సెంటిమెంటు రాష్ట్రంలో లేదని చెత్తపలుకులో ఒప్పుకుంటున్నది లేండి. అమరావతి ఇఫుడీ పరిస్ధితుల్లో ఉందంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబే అన్న విషయం అందరికీ తెలిసిందే. భ్రమల్లో విహరించకుండా వాస్తవధోరణితో ఆలోచించి చంద్రబాబు రాజధానికి అవసరమైన కనీస హంగులను ఏర్పాటు చేసేసుంటే ఇపుడీ గోలే ఉండేదికాదు.
మున్సిపల్ ఎన్నికల పేరుతో ఇపుడు విశాఖ ఉక్కు సెంటిమెంటును జతచేసి వైసీపీని ఓడించమని ఎల్లోమీడియా నిసిగ్గుగా చెత్తపలుకులో పిలుపిచ్చింది. పంచాయితి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఓడుతున్నారంటే గ్రామస్ధాయిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై జనాల్లో ఇంకా చెప్పుకోదగ్గ వ్యతిరేకత మొదలుకాలేదని అర్ధమవుతోంది. ఇదే విధమైన తీర్పు రేపటి మున్సిపల్ ఎన్నికలు తర్వాత పరిషత్ ఎన్నికల్లో కూడా ప్రతిఫలించే అవకాశాలే ఎక్కువున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేయమని చంద్రబాబు గొంతుచించుకుంటేనే ఏమీకాలేదు. పైగా కుప్పంలోనే జనాలు టీడీపీకి గూబ పగలగొట్టారు. అలాంటిది ఎల్లోమీడియా పిలుపిస్తే పట్టించుకునే వారుంటారా ?