సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. దీంతో అభిమానులు అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సంవత్సరం టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. అతి కష్టం మీద విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. బ్యాటింగ్ విభాగంలో పూర్తిగా ఓపెనర్లు ఇద్దరిపైనా ఎక్కువగా ఆధార పడుతూ ఉండడం తో వరుసగా ఓటమిలు చవి చూస్తూ వచ్చింది. కాగా నిన్న రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.



 అయితే సన్రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకోవాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంది. నిన్నటి మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించి సన్రైజర్స్ ప్లేయర్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లను ఎంతో తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగారు హైదరాబాద్ బౌలర్లు. ఇటీవల జట్టులోకి వచ్చిన జేసన్  హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ వేసి ఏకంగా మూడు వికెట్లను పడగొట్టాడు... ఆ తర్వాత రషీద్ఖాన్ విజయ శంకరులు కూడా అద్భుతమైన బౌలింగ్తో  చెరో వికెట్ పడగొట్టారు.



 ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత చేధనకు దిగిన  సన్రైజర్స్ ఓపెనర్లు వరుసగా అవుట్ కావడంతో ఒక్కసారిగా సన్రైజర్స్ అభిమానుల్లో నిరాశ నిండిపోయింది. మ్యాచ్ ఓడిపోవడం తథ్యం అనుకున్న సమయంలో వచ్చిన... మనిష్ పాండే అంటే విజయ శంకర్ లు ఎంతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఏకంగా 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మనీష్ పాండే 47 బంతుల్లో 83 నాటౌట్గా నిలువగా విజయ్ శంకర్ 51 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అయితే సన్రైజర్స్ అభిమానులందరూ కోరుకున్నదే నిన్న ఆటగాళ్లు చేశారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు సన్రైజర్స్ జట్టు  ఓపెనర్ల మీద ఎక్కువగా ఆధారపడుతూ  వచ్చింది. కానీ ఈ సారి మాత్రం మిడిల్ ఆర్డర్ కూడా పుంజుకోవడంతో సన్రైజర్స్ లో కొత్త ఉత్సాహం నిండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: