భారత జట్టులో స్థానం సంపాదించేందుకు ప్రతి ఆటగాడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలక్టర్ల దృష్టిలో పడి చివరికి భారత జట్టులో స్థానం సంపాదించుకుని అక్కడ తమ ప్రతిభను చాటి జట్టులో తమ  స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎంతో మంది ఆటగాళ్లు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతో మంది యువ ఆటగాళ్లు ఇలా భారత జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా ఎంతో శ్రమిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో అయితే యువ ఆటగాళ్లకు జట్టులో స్థానం సంపాదించుకునేందుకు  ఐపీఎల్ ఒక మంచి వేదికగా మారిపోయింది.




 ఐపీఎల్లో ఫ్రాంచైజీలు ఎంతో మంది యువ ఆటగాళ్లను భారీగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓవైపు యువ  ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు తమ జుట్టును మరింత పటిష్టంగా మార్చుకుంటున్నాయి ఐపిఎల్ ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే ఈ ఏడాది  ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు వివిధ ఐపీఎల్ జట్ల లోకి వచ్చి తమ ప్రతిభ చాటుకుని  అందరినీ ఔరా అనిపించారు అన్న విషయం తెలిసిందే. తమ బ్యాటింగ్ బౌలింగ్ ప్రతిభతో అందరిని మెప్పించారు ఈ క్రమంలోనే కొంత మంది ఆటగాళ్లు ఏకంగా భారత జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఇలా సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్లో అద్భుతంగా బౌలింగ్ వేసి తన యార్కర్లతో  అందరి మనసులనూ కొల్లగొట్టాడు నటరాజన్.



 ఇక ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్ జట్టుకు బీసిసిఐ నటరాజన్ ను ఎంపిక చేసింది అన్న విషయం తెలిసిందే.  నటరాజన్  ఎంపిక అయినప్పటికీ యువ ఆటగాడు కాబట్టి కేవలం కు బెంచ్ స్ట్రెంత్ కి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది అని అందరూ భావించారు. కానీ నటరాజన్ కి అదృష్టం బాగా కలిసి వచ్చింది. ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టులోకి సెలెక్ట్ అయిన నటరాజన్ మూడో వన్డేలో ఆడేందుకు అవకాశం వచ్చింది. ఇక మూడో వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసి మళ్ళీ ఆకట్టుకున్నాడు అయితే భారత జట్టులో స్థానం సంపాదించడాన్ని  నమ్మలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చాడు నటరాజన్.  తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని సవాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ నటరాజన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: