ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్‌లో కోహ్లీ ఏకంగా 1258 రోజులు పాటు టాప్‌ ర్యాంక్‌లో కొనసాగి వన్డే చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. కానీ తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌ కోహ్లీ తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఇటీవల కాలంలో అతనికి వన్డే క్రికెట్‌ ఆడే అవకాశం ఎక్కువగా రాకపోవడంతో టాప్‌ ర్యాంక్‌ నుంచి రెండో ర్యాంకుకు పడిపోయాడు. కోహ్లీ రెండో ర్యాంకుకు పడిపోగా.. అతడి స్థానాన్ని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన కెరీర్లోనే తొలిసారిగా అందుకున్నాడు. దీంతో పాక్ చరిత్రలో జహీర్‌ అబ్బాస్‌, జావిద్‌ మియాందాద్‌, మహ్మద్‌ యూసఫ్‌ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్న నాలుగో పాక్‌ బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో బాబర్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 103, రెండో వన్డేలో 31, మూడో వన్డేలో 94 పరుగులతో రాణించి సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో పాక్ జట్టు సఫారీలను 2-1 తో ఓడించింది. కాగా.. ఆ సిరీస్‌ ద్వారా బాబర్ 13 పాయింట్లు దక్కించుకున్నాడు. కోహ్లీపై 8 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. దీంతో టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక కోహ్లీ విషయానికొస్తే.. ఇటీవల కోహ్లీ ఇంగ్లండ్‌తో మాత్రమే వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్‌లో కూడా రెండు అర్థ సెంచరీలతో రాణించాడు. అంతేకాకుండా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి.. 857 రేటింగ్‌ పాయింట్లు ఉండడంతో రెండో స్థానానికి పడిపోయాడు. ఈ క్రమంలోనే ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌లో రాణించిన పాక్ కెప్టెన్ బాబర్‌.. పాకిస్తాన్ వన్డే కెప్టెన్ బాబర్.. 865 రేటింగ్ పాయిట్లు సాధించి నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. తొలి వన్డేలో 103, రెండో వన్డేలో 31, మూడో వన్డేలో 94 పరుగులతో రాణించి సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో పాక్ జట్టు సఫారీలను 2-1 తో ఓడించింది. కాగా.. ఆ సిరీస్‌ ద్వారా బాబర్ 13 పాయింట్లు దక్కించుకున్నాడు. కోహ్లీపై 8 పాయింట్ల ఆధిక్యం సాధించి అగ్రస్థానానికి చేరాడు.

టాప్ ప్లేస్ సొంతం చేసుకున్న బాబర్‌కు భారత మాజీ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ వసీం జాఫర్‌ విషెస్ చెబుతూనే చురకలంటించాడు. విరాట్‌కు ఛేజింగ్‌ అంటే చాలా ఇష్టమని, టాప్‌ ర్యాంక్‌ను కూడా త్వరలోనే తిరిగి దక్కించుకుంటాడని అన్నాడు. ఈ మేరకు తాజాగా ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. జాఫర్‌ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: