కరేబియన్ గడ్డపై టీమిండియా ఎంతో అద్భుతంగా రాణించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టులో సీనియర్ లు లేకపోయినప్పటికీ కేవలం ద్వితీయ శ్రేణి జట్టుతో మాత్రమే బరిలోకి దిగింది టీమిండియా. వెస్టిండీస్ పై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది. వన్డే సిరీస్లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి అదిరిపోయే ప్రదర్శన చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.. ఇక విండీస్ జట్టులో సొంతగడ్డపైనే వైట్ వాష్ చేసింది. 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇక ఈ అద్భుతమైన విజయంతో టీమిండియా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి.


 ద్వైపాక్షిక వన్డే సిరీస్లో భాగంగా 2007 నుంచి 2022 వరకు వెస్టిండీస్ పై 12 సార్లు వన్డే సిరీస్ విజయం సాధించింది. ఇలా ఒక జట్టుపై అత్యధిక వన్డే సిరీస్ లు గెలిచిన జట్టుగా టీమిండియా ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది అని చెప్పాలి.. కాగా ఆ తర్వాత స్థానంలో పాకిస్థాన్ 11 విషయాలు, సౌత్ ఆఫ్రికా 9 విజయాలతో వరుసగా మూడు స్థానాల్లో ఉన్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఇక వెస్టిండీస్ జట్టును సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేయడం భారత్కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.


 అంతేకాదండోయ్ ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక జట్టును డబుల్ వైట్వాష్ చేసిన మూడవ జట్టుగా కూడా రికార్డు సృష్టించింది టీమిండియా. ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చిన విండీస్ను 3-0 తేడాతో వైట్వాష్ చేసింది. కాగా ఇప్పుడు మరోసారి క్లీన్స్వీప్ చేసింది. ఇలా ఒక్క వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసి టీమిండియా ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకుంది అనే చెప్పాలి. అయితే ఇక మరికొన్ని ఈ రోజుల్లో టి 20 సిరీస్ ప్రారంభం కాబోతుంది. సీనియర్ ఆటగాళ్లు జట్టులో చేరబోతున్నారు. రోహిత్ శర్మ టీమిండియా బరిలోకి దిగుతుంది. కాగా ప్రస్తుతం టీమిండియా అద్భుత విజయం పై అందరి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: