టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల ఆధిపత్యానికి పెట్టింది పేరు. ఎందుకంటే ఇక టీ20 ఫార్మాట్లో బ్యాటింగ్ కోసం క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఒక బంతి కూడా వృధా చేయకుండా ఏకంగా అన్ని బంతులను బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే సిక్సర్లు ఫోర్ల తో అటు బ్యాట్స్మెన్లు చెలరేగి పోతుంటే అభిమానులు ఇంతకంటే ఇంకేం కావాలి అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పటివరకు టీ-20 ఫార్మెట్లో ఎంతోమంది మెరుపు ఇన్నింగ్స్ ఆడి తమ ఆధిపత్యాన్ని కొనసాగించారూ. బంతి  ఎక్కడ  వేసిన బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకుని వీర విహారం చేసిన వారు చాలా మంది ఉన్నారు.


 ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్కు పెరిగిపోతున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ తర్వాత రెండవ స్థానంలో న్యూజిలాండ్ జట్టు ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుంచి టి20 లు ఎక్కువ పరుగులు  చేసిన బ్యాట్స్మెన్ గా అగ్ర స్థానం కోసం ఈ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ జరుగుతుంది అని చెప్పాలి.


 మొన్నటికి మొన్న వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా మంచి ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ మార్టిన్ గప్టిల్ రికార్డును అధిగమించాడు. టి 20లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.  రోహిత్ శర్మ రికార్డు మార్టిన్ గప్టిల్ బ్రేక్ చేశాడు అని చెప్పాలి. ఇటీవలే జరిగిన టి20 మ్యాచ్ లో 15 పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్ టి20లలో 3497 పరుగులు చేశాడు.ఇక అటు రోహిత్ శర్మ 3487 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 3308 పరుగులతో విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: