గత కొన్ని రోజుల నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీ లో దుమ్మురేపుతున్నాడు అన్న విషయం తెలిసిందే. తాను కెప్టెన్సీ వహిస్తున్న ప్రతి మ్యాచ్ లో కూడా టీమిండియా కు విజయాన్ని అందించడమే లక్ష్యంగా వ్యూహాలను అమలులో పెడుతున్నాడు రోహిత్. ఇప్పటికే తన కెప్టెన్సీ సామర్థ్యం ఏంటి అన్న విషయాన్ని ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ఐదుసార్లు టైటిల్ అందించి నిరూపించిన రోహిత్ శర్మ ఇక ఎప్పుడు టీమిండియా తరఫున కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే టి20 లో వరుసగా ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ.


 ఇక ఇప్పుడు కెప్టెన్గా ఇంకో ఎన్నో రికార్డులను కొల్లగొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా తో జరిగిన టి20 సిరీస్లో రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ కు ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అనుకున్న ఆస్ట్రేలియా జట్టుకు నిరాశ మిగిల్చింది టీం ఇండియా జట్టు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో రెండు విజయాలు సాధించడం ద్వారా విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.


 భారత్ క్రికెట్ లో అంతర్జాతీయ టి20 లలో ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం 42 విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా.. ఇక ఆ తర్వాత స్థానంలో 32 విజయాలతో విరాట్ ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో రెండు విజయాల  ద్వారా ఇక విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి అంతర్జాతీయ టి20 లలో కెప్టెన్ గా 33 విజయాలు సాధించి రోహిత్ శర్మ అదరగొట్టేసాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 ద్వైపాక్షిక సిరీస్ లను ఆడింది టీమిండియా. ఇందులో 14 సిరీస్లను కూడా రోహిత్ శర్మ గెలిపించడం గమనార్హం. రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజ్ 78.57 % గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: