ప్రస్తుతం మన భారత్ క్రికెట్ టీం అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ విషయాలపై ఇండియన్ మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వన్డే వరల్డ్ కప్ చాలా దగ్గరలో ఉంది ఈ క్రమంలో అయ్యర్ గాయపడ్డాడు. ఇక సూర్య కుమార్ కి అవకాశం ఇస్తే వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఇలాగే జరుగుతూ వెళితే 2019లో ఎలాంటి పరిణామం ఎదురైందో అలాంటి పరిస్థితి మళ్లీ ఎదుర్కొక తప్పదు అంటూ జహీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం 11 మంది జట్టు సభ్యులు నాలుగవ స్థానం అత్యంత కీలకమైనది. అలాంటి ఒక కీలకమైన స్థానం కోసం మంచి పరిష్కారం దొరకకపోతే ప్రమాదం పక్కనే పొంచి ఉన్నట్టు భావించాలంటూ జహీర్ ఖాన్ చెబుతున్నారు.

ఇక జహీర్ ఖాన్ మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం మెగా ఈవెంట్ జరిగింది ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకు నాలుగో స్థానం కోసం అనేక మంది పోటీ పడుతూనే ఉన్నారు అక్టోబర్ నవంబర్ లో ఈ ఏడాది వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో నాలుగవ స్థానానికి సంబంధించిన సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది
 ఖచ్చితంగా మన బ్యాటింగ్ ఆర్డర్ సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైనా నాలుగో స్థానంలో ఆడే ఆ వ్యక్తి ఎవరో సరిగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలో జరిగిన ప్రపంచ కప్ లో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ సమస్య గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము.

అయితే శ్రేయాస్ అయ్యర్ నీ నాలుగో స్థానం కోసం గుర్తించారనే విషయం నాకు తెలిసినా అతని బాధ్యత అతని చక్కగా నిర్వర్తించాడు. కానీ గాయం అతనిని ఆ స్థానంలో ఉండకుండా చేసేలా ఉంది. ప్రపంచ కప్ ఆసన్నమయ్యే సమయానికి అయ్యర్ పూర్తిగా తన గాయ నుంచి కోలుకోకపోతే మళ్లీ మరొక ఆటగాన్ని వెతకాల్సిన అవసరమైతే ఉంటుంది చెప్పాడు.  ప్రస్తుతం టీమిండియా పరిస్థితి అంత బాగాలేదు మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ ను చూస్తే అది అర్థమవుతుంది. జట్టు మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. వరల్డ్ కప్ కి భూముల వస్తే మాత్రం భారత్ కి తిరిగి ఉండదు. 12 ఏళ్ల క్రితం ప్రపంచకప్ ని ధోని సారధ్యంలో భారత జట్టు కైవసం చేసుకుంది ఇక 28 ఏళ్ల నిరీక్షణకు అభిమానులకు పండగ చేసుకునే వార్త ఇచ్చాడు అంటూ జహీర్ చెప్పుకచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: