ఇక వాహన రంగంలో బీఎండబ్ల్యూ కంపెనీ చాలా వేగంగాదూసుకుపోతోంది. ఈ కంపెనీకి సంబంధించిన కారైనా కాని బైకైనా కాని తనదైన కొత్త ప్రత్యేకతలతో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక త్వరలో ఈ కంపెనీ ఇండియాలో bmw C 400 GT స్కూటర్‌ని లాంచ్‌ చేయబోతుంది. ఇక bmw కంపెనీ డీలర్‌షిప్‌లలో ఇప్పటికే 100 బుకింగ్‌లు నమోదైనట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఇది భారతీయుల దృష్టిని ఎంతగానో ఆకర్షించనుంది. ఇక ఈ స్కూటర్‌లో సరికొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి.అవేంటంటే ఆప్రాన్-మౌంటెడ్ హెడ్‌లైట్, విండ్‌స్క్రీన్, స్ప్లిట్-స్టైల్ ఫుట్‌బోర్డ్ ఇంకా అలాగే స్పోర్టిగా కనిపించే పిలియన్ గ్రాబ్‌లతో ఎంతో స్టైలిష్‌గా ఇంకా అలాగే ఎంతో ఆకర్షణీయంగా కూడా కనిపిస్తుంది. LED లైటింగ్, రైడ్-బై-వైర్ థొరెటల్ ఇంకా కీలెస్ ఇగ్నిషన్, హీటెడ్ గ్రిప్స్, సీట్లు, యాంటీ-థెఫ్ట్ అలారం ఇంకా మోటరోరాడ్ కనెక్టివిటీ అలాగే మరెన్నో ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.ఇది C 400 GT 350 cc సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంకా ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఇక ఇది 7,500 rpm వద్ద 34 hp పవర్‌ ఇంకా 35 Nm గరిష్ట టార్క్‌ను 5,750 rpm వద్ద అందించడం జరుగుతుంది.అలాగే ఇంజిన్ CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది.ఇక ఈ స్కూటర్ గరిష్టంగా139 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది.అలాగే స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు ఇంకా వెనుకవైపు సర్దుబాటు చేయగల డ్యూయల్ స్ప్రింగ్-లోడెడ్ షాక్ అబ్జార్బర్‌లు కూడా ఉన్నాయి. అలాగే ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఇంకా అలాగే వెనుకవైపు సింగిల్ డిస్క్ యూనిట్‌ను కూడా కలిగి ఉంది.ఇక bmw C 400 GT ప్రీమియం ధర  వచ్చేసి ట్యాగ్‌తో వస్తుందని అందరూ భావిస్తున్నారు.ఇక ఈ స్కూటర్ కి దాదాపుగా లక్ష బుకింగ్‌ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక అలాగే సుమారు రూ.7 లక్షల ధర కూడా ఉంటుందని సమాచారం తెలుస్తోంది. ఇక ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన స్కూటర్‌గా bmw C 400 GT మారబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: