సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, భూమి ఇలా ఎన్నో గ్రహాలు కోటానుకోట్ల నక్షత్రాలు. ఇంకా ఏమున్నాయి, వాటిపై జీవజాలం ఉందా..? ఇలా అంతులేని రహస్యాలు చేదించేందుకు మనిషి విశ్వప్రయత్నాలు, ఉపగ్రహాలు పంపించాడు. రోబోటిక్ రోవర్ లను ప్రయోగించాడు. అంతే కాదు నాడు గెలీలియో టెలిస్కోప్ తో ఖగోళ రహస్యాలను శోధించి ప్రపంచానికి సరికొత్త విషయాలని తెలియజేశాడు. ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు నింగిలోకి మరో భారీ టెలిస్కోప్. రోదసి సీక్రెట్ లను అన్వేషించబోతున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్. బిగ్బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భావ సంగతుల శోధన. హబుల్ టెలిస్కోప్ కంటే మరిన్ని సీక్రెట్స్ చెబుతుందా..?

 చైనా టెలిస్కోప్ రేంజ్ కంటే ఇంకెన్నో రహస్యాలు చేదిస్తుందా..? అంతుచిక్కని ప్లానెట్స్ వివరాలు అందిస్తున్న హబుల్ టెలిస్కోప్ కు వారసురాలిగా అంతకన్నా శక్తివంతంగా తీర్చిదిద్దిన పరికరం జేమ్స్ వెబ్ టెలిస్కోప్. యూరోపియన్, కెనడా స్పెస్ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును డెవలప్ చేసింది. దాదాపు ఇరవైకి పైగా దేశాలు ఈ టెలిస్కోప్ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. ఫ్రెంచ్ గినియా సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపుతున్నారు. అనంత విశ్వంలో మనకు తెలియనిది ఏదో ఉంది. మనకన్నా శక్తివంతులెవరో ఉండే ఉంటారట. వాటిని ఛేదించేందుకే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం. ఏలియన్స్ వంటి అంశాలను శోధించి సమాచారం ఇవ్వబోతోంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ లక్ష్యం విశ్వం ఆనుపానులు తెలుసుకోవడం. సువిశాల విశ్వం గురించి అవగాహన పెంచుకోవడం.

 ఇప్పటి వరకు ఎరుగని కనీవినీ కొత్త లోకాన్ని చూడడం కోసం. భూమ్మీద ఉన్న టెలిస్కోపులు సహాయంతో పరిశోధనలు చేస్తున్న సైంటిస్టులు మన సౌర కుటుంబానికి అవతల కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి అని ఎప్పుడో గుర్తించారు. అయితే ఈ  ఎక్సో ప్లానెట్ లు ఎలా ఉంటాయి, వాటిలో ఉండే రసాయనాలు ఏంటి అన్నది మాత్రం తెలియలేదు. తన కెమెరా సాయంతో ఈ చిక్కుముళ్లు అన్నింటినీ విప్పేసింది హబుల్ టెలిస్కోప్. ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ కంటే శక్తివంతమైనదని చెబుతున్నారు. చూడాలి హబుల్ కంటే జేమ్స్ ఇంకెన్ని విశ్వ రహస్యాలను మనిషికి చేరవేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: