బుల్లి పిట్ట: ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమె..!! ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది.ఎలక్ట్రిక్ స్కూటర్లను వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నది ప్రతిరోజు కార్యాలయానికి వెళ్లి వచ్చేవారిలో ఎక్కువగా ఉద్యోగస్తుల ఉండడంతో ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఖర్చు ఎక్కువ అవుతూ ఉండడంతో వారు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వము ఈ స్కూటర్లను అందించే దిశగా అడుగులు వేస్తోంది. మొదట ఉద్యోగులకు వీటిని అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసినట్లు.


అయితే కొనుగోలు చేసిన ఈ స్కూటర్లను ఒకేసారి కాకుండా 60 నెలల పాటు వాయిదా పద్ధతిలో ఈఎంఐ డబ్బులు చెల్లించుకునే సదుపాయాన్ని కల్పిస్తోందట. అయితే ప్రైవేటు సంస్థలో పని చేసే ఉద్యోగస్తులు మాత్రం ఆ సంస్థ నిర్వహకుడు మేనేజర్ బాధ్యత తీసుకుంటే ఆ వ్యక్తికి కూడా ప్రతి నెల ఈఎంఐ పద్ధతిలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు అవసరమైన ప్రణాళికను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పద్ధతిలో సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే సుమారుగా 10 వేలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక వీటికోసం ఉమ్మడి జిల్లా లో 13 ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రభుత్వ కార్యాలయలో పాటు ,ప్రైవేటు సంస్థలలో కూడా ఈ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో పనిచేసే వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలియజేశారు. ఒక్క సారి కారుకు చార్జి చేస్తే చాలు 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించి వీలు కలదు ఇలాంటి వాటిని కూడా త్వరలోనే తీసుకురాబోతోంది.. రాబోయే రోజులలో మరింత టెక్నాలజీ వాటిని ప్రవేశపెడుతున్నట్లుగా ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. పూర్తి వివరాల కోసం నెడ్ కాఫ్ డిఎం ను 9000550972 , డివోను 9989949144 నెంబర్లతో సంప్రదించవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి: