స‌హ‌జంగా ప్రతి ఒక్క‌రి జీవితంలో ఆధార్ అనేది కీలక గుర్తింపుగా మారిపోయింది. మొబైల్ నెంబర్ నుండి పాన్ కార్డ్, బ్యాంకు ఖాతా మరియు డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా ఇంకా ఎన్నో సేవలకు ఆధార్ తప్పనిసరి చేశారు. తాజా రిపోర్ట్ ప్రకారం UIDAI మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రైవింగ్ లైసెన్స్  ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేస్తుంది. 


డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ కార్డుని లింక్ చేయడం వల్ల‌ నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లకు చెక్ పెట్టడానికి అలాగే యాక్సిడెంట్ కేసులను త్వరగా విచారణ జరపడానికి సులువుగా చేస్తుంది. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ కార్డుతో లింక్ ఎలా చేయాలో  తెలుసుకుందాం. 


- వెబ్‌సైట్ హోం పేజీలో ఎడమవైపున ఆధార్ నెంబర్ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో ఆధార్ నెంబర్ ఎంట్రీ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.


- ఆధార్ డిటైల్స్ ఎంట్రీ అనే పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలక్ట్ సెర్చ్ ఎలిమెంట్ బాక్సులో రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా లైసెన్స్ ఆప్షన్స్‌లో ఒక దానిని ఎంచుకుని, రిజిస్ట్రేషన్ నెంబర్ బాక్సులో డ్రైవింగ్ లెసెన్స్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డిటైల్స్ మీద క్లిక్ చేయాలి.


- డ్రైవింగ్ లైసెన్స్‌కు సంభందించిన డిటైల్స్‌తో పాటు క్రింది వైపున ఆధార్ మరియు మొబైల్ నెంబర్ కాలమ్ కనిపిస్తుంది. ఇక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ మరియు 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ నొక్కాలి.


- మొబైల్ నెంబర్‌కు వచ్చిన నాలుగు అంకెల వన్ టైమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి కన్‌ఫర్మ్ చేంజెస్ అనే ఆప్షన్ నొక్కగానే మీ ఆధార్ నెంబర్ డ్రైవింగ్ లైసెన్స్‌తో లింక్ అయిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: