పాత స్మార్ట్‌ఫోన్‌తో విసికిపోయారా..? త‌క్కువ బ‌డ్జెట్‌లోనే అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ కొనాల‌నుకుంటున్నారా..? మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఈ ఫోన్ల‌పై ఓ లుక్కేసి మీకు స‌రిపోయే స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోండి. సాధారణంగా మనదేశంలో వినియోగదారులు ఎక్కువ కొనుగోలు చేసేది రూ.15 వేల రేంజ్ లో ఉన్న స్మార్ట్ ఫోన్లనే. దీంతో ఈ సెగ్మెంట్ లోనే మీకు లెక్కలేనన్ని స్మార్ట్ ఫోన్లు కనపడతాయి. అయితే ఏది ఎంచుకోవాలో తెలియ‌క తిక‌మ‌క ప‌డ‌తారు. అందుకే ప్రస్తుతం రూ.15,000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 

రియల్ మీ 5 ప్రో.. ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 712 AIE ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.  దీని బ్యాటరీ సామర్థ్యం 4,035 ఎంఏహెచ్ గా ఉంది. వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. వీటి ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో మూడు కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్. ఇక దీని ధ‌ర  రూ.12,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్.. ఇందులో 6.4 అంగుళాల డిస్ ప్లేను, ఎక్సోనిస్ 9611 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది.

 

6000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ ఇందులో ఉంది. అలాగే వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను కూడా ఇందులో అందించారు. వీటిలో సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది. దీని ధ‌ర రూ.12,999గా ఉంది.  ఒప్పో కే1.. ఇందులో 6.41 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.  ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 3,600 ఎంఏహెచ్ గా ఉంది.

 

ఇందులో వెనకవైపు 16 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను అందించారు. వీటిలో సెల్ఫీ కెమెరా సామర్థ్యం 25 మెగా పిక్సెల్. దీని ధ‌ర రూ.13,990గా ఉంది.  రెడ్ మీ నోట్ 8 ప్రో.. ఇందులో 6.53 అంగుళాల డిస్ ప్లే,  మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్ గా ఉంది. వెనకవైపు 64 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న నాలుగు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 20 మెగా పిక్సెల్. దీని ధర రూ.14,999గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: