ఒప్పో తాజాగా కె సిరీస్ స్మార్ట్‌ఫోన్ కె 9 ప్రోను చైనాలో విడుదల చేసింది. ఈ మధ్య మిడ్‌రేంజ్‌లో ప్రీమియంలో కొన్ని అద్భుతమైన ఫీచర్లను ప్యాక్ చేస్తుంది. ఫోన్‌లో మంచి బ్యాటరీ, పెద్ద స్క్రీన్‌తో అద్భుతమైన కెమెరా ఉన్నాయి. K9 ప్రో స్మార్ట్‌ఫోన్ AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్, 120Hz రిఫ్రెష్ రేట్, 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఓ నివేదిక ప్రకారం స్మార్ట్‌ ఫోన్ సుమారు రూ. 25,000 వద్ద ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది అబ్సిడియన్ వారియర్ బ్లాక్, గ్లేసియర్ ఓవర్‌చర్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో ప్రవేశ పెట్టారు. ఈ 5g స్మార్ట్‌ఫోన్ 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ (1080x2400 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్‌తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్‌డిఆర్ 10 సపోర్ట్ కలిగి ఉంది.

ఒప్పో కె 9 ప్రో స్పెసిఫికేషన్‌లు
నివేదిక ప్రకారం ఫోన్ MediaTek Dimensity 1200 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB ప్లస్ ర్యామ్, 256GB వరకు స్టోరేజ్‌తో ఉంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS 11.3 పై రన్ అవుతుంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 mAh బ్యాటరీతో వస్తుంది.

Oppo K9 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 64 మెగా పిక్సెల్ (f/1.7) ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ (f/2.2) అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ (f/2.4) మాక్రో స్నాపర్ ఉన్నాయి. ఇది సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగా పిక్సెల్ (f/2.4) ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, హెడ్‌ఫోన్ జాక్, టైప్ సి పోర్ట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒప్పో అక్టోబర్ 1 న భారతదేశంలో 50 మెగా పిక్సెల్ కెమెరాతో అద్భుతమైన ఫోన్‌ను విడుదల చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: