ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ గురించి తెలుసుకోండి...మన దేశానికి రైతులు అన్న దాతలు.అలాంటి రైతులు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పంటలు పండించాలంటే మాటలు కాదు.. దుక్కిదున్నాలి.. విత్తనాలు చల్లాలి.. ఆ సమయంలో వరుణదేవుడు సహకరిస్తే సరి. ఒక‌వేళ క‌రుణించ‌లేదా.. విత్తనాలను మొలకెత్తించేందుకు నీటి కోసం వెతుకులాట. మన కడుపునింపే ఆహారాన్ని పండించే రైతన్న అంతకన్నా గొప్పవాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆ తర్వాత పంట చేతికందే వరకూ కంటిపాపలా కాచుకుని ఉండాలి. పొలాల్లో ఊడ్పులు తర్వాత మిగిలే గడ్డిని పొగేసి ఒక చోట చేర్చడం రైతులకు చాలా కష్టమైన పని. అదంతా చెయ్యాలంటే చాలా టైమ్ పడుతుంది. అయినా కాని రైతులు కష్టపడి పని చేస్తారు.

సాధారణంగా రైతులు పొలంలో గడ్డిని కొయ్యడానికి చాలా అవస్థలు పడతారు. ఆ గడ్డిని కొయ్యలంటే పొద్దున నుంచి సాయంత్రం దాకా ఎన్నో తిప్పలు పడతారు. దాని వల్ల వారికి చాలా సమయం, శక్తి వృధా అవుతుంది. ఇక ఈ యంత్రం వలన వారికి చాలా సమయం ఆదా అవుతుంది. కష్టమూ తగ్గుతుంది. అందుకే ఈ క్రమంలో  హర్యానాలోని రైతులు సరికొత్త ట్రాక్టర్ మౌంటెడ్ మెషిన్ తో గడ్డిని ఊడ్చేస్తున్నారు. ట్రాక్టర్‌కు ఏర్పాటు చేసిన ఈ యంత్రం... పొలంలో పోగేసిన గడ్డి మీదుకు ప్రయాణిస్తే చాలు. అది నేలపై ఉన్న గడ్డిని గ్రహించి గుండ్రంగా చక్రంలా మార్చేసి బయటకు వదిలేస్తుంది. ఈ యంత్రం పనితీరును చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.చాలా ఈజీగా గడ్డిని ఇలాంటి ఒడి దుడుకులు లేకుండా శుభ్రంగా పోగు చేస్తుంది.ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ప్రపంచంలో జరిగే వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి..



మరింత సమాచారం తెలుసుకోండి: