విజయనగరం ఉత్తరాంధ్రాలో కీలకమైన జిల్లా.విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో మెయిన్ గా విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, రాజాం.. ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్లు అనేవి కీలకంగా ఉన్నాయి.ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో ఫైనల్ గా విజయనగరం లో ఏ జెండా ఎగిరిద్దో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ముందుగా గజపతినగరంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా ఆర్థిక, అంగబలం ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌ను తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపింది. 1955 వ సంవత్సరం నుంచి ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా టీడీపీ ఐదుసార్లు గెలుపొందగా.. కాంగ్రెస్ నాలుగుసార్లు గెలుపొందింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బొత్స అప్పలనర్సయ్య గెలిచారు. ఈసారి  టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గెలిచే ఛాన్స్ ఉంది.


బొబ్బిలిలో కే కే రంగారావు గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.అప్పల్ నాయుడు  వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కానీ రంగారావు కూటమి అభ్యర్థిగా కచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉంది. మెజారిటీ తగ్గొచ్చు పెరగొచ్చు.గెలుపు అవకాశాలు  బొబ్బిలి నియోజకవర్గంలో కూటమికి ఉన్నాయి. మరి చూడాలి ఏమవుతుందో. 


చీపురుపల్లిలో కళా వెంకట్రావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కానీ వైసీపీ అభ్యర్థి  బొత్స సత్యనారాయణ ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది.


విజయనగరం టౌన్లో అదితి గజపతిరాజు టీడీపీ తరుపున పోటీ చేస్తుండగా వీరభద్ర స్వామి ఇక్కడ వైఎస్ఆర్సిపి తరుపున పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో అదితి గజపతిరాజు గెలిచే ఛాన్స్ ఉంది.


నెల్లిమర్లలో మాధవి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బట్టుకొండ అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. వీరిలో మాధవి గెలిచే ఛాన్స్ ఉంది.


ఇక రాజాంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీకి పోటీగా పాలకొండకు చెందిన తలే భద్రయ్య కుమారుడు తలే రాజేష్‌ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు.వీరిద్దరిలో కోండ్రు మురళీ గెలిచే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: