మనిషి జీవితం దేవుడు చేతిలో కీలుబొమ్మలాంటిది. ఈ క్రమంలోనే మనిషికి మరణం ఎప్పుడు సంభవిస్తుంది అన్నది కూడా ఊహకందనీ విధంగానే ఉంటుంది. ముఖ్యంగా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనిషి జీవితం ఇంతేనా అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే అంతా సరదాగా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని రీతిలో క్షణకాల వ్యవధిలో మృత్యువు దూసుకు వస్తూ కబళిస్తూ ఉంది అని చెప్పాలి. తద్వారా ఇలాంటి ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సరదాగా గడిపేందుకు చుట్టాల ఇంటికి వెళ్లిన ఆ కుటుంబానికి తిరుగు ప్రయాణం సమయంలో మాత్రం విధి చిన్నచూపు చూడటంతో చివరికి శోకమే మిగిలిపోయింది. కళ్ళ ముందు కన్న కూతురు కొట్టుకుపోతున్న కూడా కాపాడలేని నిస్సహాయ స్థితిలో తల్లితండ్రులు గుండెలు పగిలేలా వినిపించారు. ఈ ఘటన కేరళ అల్లాపూజ జిల్లాలో వెలుగు చూస్తుంది. సుశీల, సురేంద్ర దంపతులకు ఒక్కగానొక్క కూతురు హర్ష. ఇటీవలే ఫ్యామిలీ అందరూ కలిసి కురువకుండలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణం సమయంలో దగ్గరలో ఉన్న కొండ ప్రాంతంలో ఒక రిసార్ట్ కు వెళ్లారు.


 సాయంత్రం దాకా అక్కడే సరదాగా గడిపి ఐదున్నర గంటల సమయంలో నీటి ప్రవాహం దగ్గరికి వెళ్లారు. అయితే వాతావరణం అంతా మామూలుగా ఉండడంతో కుటుంబ సభ్యులంతా నీళ్లలో దిగు హుషారుగా ఉన్నారు. అంతలోనే వారి సంతోషం కాస్త విషాదంగా మారిపోయింది. ఆకస్మాత్తుగా వరద రావడంతో అక్కడున్న వాళ్ళు చెల్లాచెదురు అయిపోయారు. చిన్న పిల్లలతో సహా కాస్త దూరం కొట్టుకుపోయారు. ఇక అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరారు. కానీ పాపం అర్ష మాత్రం నిస్సహాయ స్థితిలో వరద ప్రభావం లో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడలేక తల్లిదండ్రులు అచేతన స్థితిలో గుండెలు పగిలేలా ఏడ్చారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: